వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబిత ఇంటికెళ్లవచ్చు, కిరణ్ దానకర్ణుడి ఫోజులు: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాజమండ్రి: రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడలేని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇక ఇంటికి వెళ్లవచ్చునని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం ఎద్దేవా చేశారు. ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోని ఎస్.సూరవరం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానకర్ణుడిలా ఫోజులిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఏడాదిలో కాంగ్రెసు ప్రభుత్వం పథకాల పేరుతో జిమ్మిక్కులు చేస్తోందన్నారు. మరోసారి కాంగ్రెసు పార్టీని నమ్మితే ఇళ్ల పైన కప్పులను కూడా అమ్ముకోవాల్సి ఉంటుందన్నారు.

అమ్మహస్తం ఓ దండుగ పథకం అన్నారు. అది అమ్మహస్తం కాదని మొండి హస్తం అన్నారు. పేదలపై ఛార్జీల పేరుతో, పన్నుల రూపంలో భారం వేస్తూ భారీగా దండుకుంటున్న ప్రభుత్వం రూ.185కు తొమ్మిది సరుకులు ఇస్తామనడం దారుణమన్నారు. పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

విద్యుత్‌ను సక్రమంగా ఇవ్వలేని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. శాంతిభద్రతలను కాపాడలేని హోమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటికి వెళ్లవచ్చునన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సంపై చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has 
 
 demanded Home Minister Sabitha Indra Reddy's 
 
 resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X