గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నయగారా వద్ద ఆంధ్రా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur
వాషింగ్టన్: అమెరికాలో పన్నెండు రోజుల క్రితం అదృశ్యమైన గుంటూరు జిల్లా సాఫ్టువేర్ ఇంజనీర్ శరత్ కుమార్ శవమై తేలాడు. నయగారా జలపాతం వద్ద స్థానిక పోలీసులు ఓ భారతీయుడి మృతదేహాన్ని కనుగొన్నారు. ఇది శరత్ కుమార్‌గా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన శరత్ కుమార్ గత నెల 31వ తేదిన అదృశ్యమైన విషయం తెలిసిందే. చికాగోలోని టిసిఎస్ సంస్థలో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతను నయగారా జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. ఆదివారం(మార్చి 31) పర్యటన కోసం వెళ్లిన శరత్ కుమార్ ఆ తర్వాత తిరిగి రాలేదు.

నయగారా జలపాతం చూసి తిరిగి వస్తున్న అతను వాషింగ్టన్ డిసిలో అదృశ్యమయ్యారు. శరత్ తిరిగి రాకపోవడంతో సహచరులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరులోని కుటుంబ సభ్యులు, అతని బంధువులు తీవ్ర ఆందోళన పడ్డారు. ఇప్పుడు నయగారా జలపాతం వద్ద అతని మృతదేహం లభించింది.

శరత్ కుమార్ మిస్ అయ్యాడని చెప్పడంతో స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఇతని మృతదేహం లభించడంతో అతను ఎలా మరణించాడన్నది తెలియరాలేదు. ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగిపోయాడా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆధారాలు సేకరిస్తున్నామని వివరాలు వెల్లడిస్తామన్నారు.

English summary

 Guntur Software Engineer Sarath Kumar was found dead at Niagara falls. Local police investigating this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X