హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపిని అరెస్టు చేస్తేనే: యాష్కీ, సిఎంతో తేడా: వివేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki-Vivek
హైదరాబాద్/కరీంనగర్: వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా చెప్పుకునే కెవిపి రామచందర్ రావుపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెవిపి వల్లనే తెలంగాణ ఆగిపోయిందని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో కెవిపిని అరెస్టు చేసి జైలులో పెడితే తెలంగాణను అడ్డుకునేవారు ఉండరని ఆయన అన్నారు. తాను విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత కెవిపిపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన కుట్రలు, అక్రమాలన్నింటికీ కెవిపియే ప్రధాన సూత్రధారి అని యాష్కీ ఆరోపించారు. కెవిపిని ప్రశ్నిస్తే అన్ని విషయాలూ బయటపడతాయని ఆయన అన్నారు. తెలంగాణ నేతలు కూడా తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది వారేనని ఆయన అన్నారు. ఏదో ఒక్క రాజకీయ పార్టీ వల్ల తెలంగాణ రాదని, ప్రజల చేతిలో ఉద్యమం ఉన్నప్పుడే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని పెద్దపల్లి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు వర్గం తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందనే వార్తలను ఆయన ఖండించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొంత మంది తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేస్తున్న తన కృషిని అడ్డుకునేందుకే కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు విషయమై మరోసారి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుస్తానని ఆయన చెప్పారు.

English summary
Congress Telangana MP Madhu Yashki said that Rajyasabha member KVP Ramachandar Rao obstructed the formation of Telangana state. MP Vivek accepted his differences with CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X