danam nagender manda jagannadham anam ramanarayana reddy ys rajasekhar reddy దానం నాగేందర్ మంద జగన్నాథం ఆనం రామనారాయణ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి
ఆనం వ్యాఖ్యపై దానం నో: కెసిఆర్‌తో భేటీ నిజం.. మందా

దీనిపై దానం స్పందిస్తూ తెలంగాణ అంశంపై తెరాసలో చేరడం వంటి తొందరపాటు నిర్ణయాలు వద్దన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై తాను తర్వాత స్పందిస్తానని చెప్పారు. మంత్రివర్గ సమష్టి నిర్ణయాలకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఒక్కరినే బలి చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తమ అభిమాన నేత అన్నారు. బిసి నేత మోపిదేవి వెంకటరమణ బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
కెసిఆర్‌తో భేటీ వాస్తవమే.. మందా
తాను తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయిన విషయం వాస్తవమేనని మందా జగన్నాథం చెప్పారు. పాలమూరు జిల్లాలో కాంగ్రెసు పార్టీ భ్రష్టు పట్టిపోతోందన్నారు. మంత్రి డికె అరుణ తెలంగాణ వ్యతిరేకి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తనను కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారని మందా జగన్నాథం చెప్పారు. బడ్జెట్ సమావేశాల తర్వాత తాను ఓ నిర్ణయాన్ని తీసుకుంటానన్నారు. తాను పార్టీ మారడానికి ఎవరి అనుమతులు అవసరం లేదని మండిపడ్డారు.
జగన్ పార్టీ జైలుకే పరిమితం.. డికె అరుణ
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జైలుకే పరిమితమయిందని మంత్రి డికె అరుణ బస్సు యాత్ర సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నారన్నారు. కిరణ్ సర్కారు గత ప్రభుత్వాల కంటే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోందన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
జానాతో కెకె భేటీ
మంద జగన్నాథం పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డితో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు ఆదివారం భేటీ అయ్యారు. వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.