వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసుపై ధర్మాన వింత వ్యాఖ్య: వైరం లేదన్న కృష్ణదాసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dharmana Prasad Rao
శ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాద రావు శనివారం చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తన ముప్ఫై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన తనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కేసులు పెట్టడంతో తన పాపులారిటీ మరింత పెరిగిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సభలో ఆయన మాట్లాడారు. తానెప్పుడూ తప్పు చేయలేదని, తప్పుటడుగు వెయ్యలేదన్నారు.

ఎన్ని ఆరోపణలొచ్చినా ప్రజల విశ్వాసం ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. తనపై కొన్ని పత్రికల్లో వక్రీకరణ కథనాలు ప్రచురించినా తననెవరూ అప్రతిష్ఠ పాలు చేయలేరని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేది లేదని ధర్మాన హెచ్చరించారు.

తమ్ముడితో వైరం లేదు.. కృష్ణదాసు

రాజకీయంగా వైష్యమాలున్నా, వ్యక్తిగతంగా తన తమ్ముడు మంత్రి ధర్మాన ప్రసాద రావు, తాను ఇద్దరం ఒక్కటేనని, ఒకే తల్లి బిడ్డలమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాత్రి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సభలో ఆయన మాట్లాడారు.

తన సోదరుడు ప్రసాద రావు పిలుపు మేరకు తాను రాజకీయాల్లో వచ్చానని చెప్పారు. తన కోసం నరసన్నపేట స్థానాన్ని విడిచి 2004లో శ్రీకాకుళానికి ప్రసాద రావు వెళ్లారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి నడుస్తున్నానని చెప్పారు. నరసన్నపేట ఉపఎన్నికల్లో మరో సోదరుణ్ని కాంగ్రెస్ తరఫున గెలిపించేందుకు కృషి చేయడం మంత్రి ధర్మాన రాజకీయ ధర్మమని కృష్ణదాస్ అన్నారు.

English summary
Minister Dharmana Prasad Rao said on Saturday that 
 
 his popularity increased with CBI case against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X