హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరల్డ్ టూరిజం మీట్: డప్పుదరువుకు స్టెప్పులేసిన చిరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రపంచ పర్యాటక సదస్సులో శనివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెండు రోజులుగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రపంచ పర్యాటక సదస్సు జరుగుతోంది. ఈ నెల 12న ఇది ప్రారంభమైంది. ఈ రోజుతో ముగియనుంది.

సదస్సు కోసం వచ్చిన విదేశీ ప్రతినిధుల బృందానికి శిల్పారామంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పద్మజా రెడ్డి శిష్య బృందం శాస్త్రీయ నృత్యం, చిందు యక్షణ గానం, తప్పెట గుళ్లు, పులివేషాలు, పగటి వేషాలు, కొమ్ముకొయ్య నాట్యాలు విదేశీ ప్రతినిధుల బృందాన్ని ఆకట్టుకున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కళాశాల విద్యార్థులు తాడాట విన్యాసాలు చేశారు. విద్యార్థులు, ఇతరులు వేదిక పైన నాట్యం, తాడాట విన్యాసాలు చేస్తుండగా చిరంజీవి వేదిక పైకి వెళ్లి డప్పు దరువుకు అనుగుణంగా నాట్యం చేశారు. విద్యార్థులతో చిరంజీవి కాసేపు చిందేశారు.

చిరంజీవి కూడా స్టెప్పులేయడంతో అందరూ మంత్రముగ్ధులయ్యారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... యువతీ యువకులు సంప్రదాయ కళలు నేర్చుకొని ప్రతిభ కనబర్చడం అభినందనీయం, హర్షనీయమని చెప్పారు. ఈ సదస్సులో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

English summary
Central Tourism Minister Chiranjeevi performed dance at World Tourism Meet on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X