వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి కాంగ్ ఎంపీల రహస్య భేటీ: వివేక్ డైలమా, పొన్నం నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana MPs secret meeting
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు సోమవారం ఉదయం రహస్యంగా భేటీ అయ్యారు. ముగ్గురు ఎంపీలు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో పలువురు ఎంపీలు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి.వివేక్ ఇంట్లో ఈ రోజు రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, రాజయ్యలతో పాటు సీనియర్ నేత కె కేశవ రావు పాల్గొన్నారు. వివేక్ నియోజకవర్గంలో ఉండటంలో హాజరు కాలేదని సమాచారం.

వీరు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరాసలోకి వెళ్లే అంశంపై మంతనాలు జరిపినట్లుగా సమాచారం. మందా జగన్నాథం దాదాపు తెరాసలోకి వెళ్లేందుకే సుముఖత చూపినట్లుగా తెలుస్తోంది. కె కేశవ రావు కూడా తెలంగాణపై అధిష్టానం తేల్చకుంటే తెరాసలోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదన్నారట. అయితే, కొంతకాలం చూసిన తర్వాత నిర్ణయం తీసుకుందామని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సూచించారని సమాచారం.

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ కాంగ్రెసులో ఉండేందుకే నిర్ణయించుకున్నారు. పొన్నం కూడా అదే దార్లో నడుస్తారని అంటున్నారు. మందా జగన్నాథం ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల సమయంలో తెలంగాణ కోసం సస్పెండై 27లోగా పార్టీలో చేరాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు వివేక్, వరంగల్ ఎంపి రాజయ్యలు డైలామాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ డైలామా

తెలంగాణ కాంగ్రెసు ఎంపీల అంశంపై వివిధ రకాల ప్రచారం సాగుతుండగా కోమటిరెడ్డి సోదరులు కూడా ఏ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం మొదలయింది. వారు తెరాసలోకి, జగన్ వైపుకు అనుకూలంగా ఉన్నారు. దీంతో ఏ పార్టీలో చేరతారనే అంశం సస్పెన్స్‌గా మారింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కోమటిరెడ్డి సోదరుల బాటలోనే నడుస్తారని అంటున్నారు.

English summary
Telangana Congress MPs Ponnam Prabhakar, Rajaiah, Manda Jagannadham met at Peddapalli MP G.Vivek's residence on Monday secretely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X