వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ ఎన్టీఆర్ అసంతృప్తి!: బాబును కల్సిన కళ్యాణ్‌ రామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kalyan Ram
విశాఖపట్నం: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సోమవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు రెండు రోజులుగా విశాఖలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ రోజు కళ్యాణ్ రామ్ మావయ్య చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. వైద్యులను బాబు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

కళ్యాణ్ రామ్ కలయికపై చర్చ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు చంద్రబాబు, నందమూరి బాలకృష్ణపై అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ పర్యటన నుండి ప్రారంభమైన రగడ కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీలలో జగన్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను వాడటం చర్చనీయాంశమైంది. దీనిపై జూనియర్ ఇటీవల బాద్ షా చిత్ర విజయవంత వేడుకలో వివరణ ఇచ్చారు. తాను టిడిపితోనే ఉంటానని చెప్పారు. అయితే, అంతకుముందు హరికృష్ణ చెప్పాల్సింది ఎంతో ఉందని భిన్నంగా స్పందించారు. దీంతో జూనియర్, హరికృష్ణలు అసంతృప్తితో ఉన్నట్లు బట్టబయలైంది.

అయితే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉండగా కళ్యాణ్ రామ్ మాత్రం చంద్రబాబుకు పూర్తిగా మద్దతు పలకడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం మరో నందమూరి హీరో తారక రత్న కూడా తమ నాయకుడు చంద్రబాబేనని, బాబాయ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, తాను అందరం కార్యకర్తమని చెప్పారు.

English summary
Nandamuri Hero Kalyan Ram was met Telugudesam Party chief Nara Chandrababu Naidu on Monday in Vishakapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X