ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

700 మీటర్ల లోయలో పడ్డ వాహనం: 12 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Himachal Pradesh
షిమ్లా/విశాఖపట్నం/హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని చాంబ జిల్లా తల్హాని వద్ద ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వాహనం ఏడు వందల మీటర్ల లోతులోని లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆదివారం రాత్రి జరిగింది. చనిపోయిన వారంతా 11-25 సంవత్సరాలలోపు వయస్సు వారే.

హైదరాబాదులో కంటైనర్ ఢీకొని బాలుడి మృతి

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చాంద్రాయణగుట్టలో ఓ కంటైనర్ సోమవారం ఉదయం బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చాంద్రాయణగుట్టలోని ఉప్పుగూడలో ఈ ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొని మృతి చెందాడు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖలో అగ్ని ప్రమాదం

విశాఖపట్టణంలోని ద్వారకానగర్ ప్రధాన ఆర్టీసి బస్టాండు వద్ద ఉన్న ఓ దుకాణ సముదాయంలో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కాంప్లెక్సులోని ఓ దుకాణంలో మంటలు చెలరేగి మిగతా దుకాణాలకు అంటున్నాయి. పోలీసులు కాంప్లెక్సులోని వారిని ఖాళీ చేయించారు. నాలుగు అంతస్తుల ఈ భవనంలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది చల్లార్చే ప్రయత్నాలు చేస్తోంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కర్నూలు - ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గిద్దలూరు - నంద్యాల రోడ్డు వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

బస్సులో మంటలు

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలం పాలంగి సమీపంలో ఉదయం ఓ స్కూలు బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అఫ్రమత్తమైన డ్రైవర్ బస్సులోని విద్యార్థులను క్షేమంగా బయటకు దించేశాడు. బస్సు దగ్ధమైంది.

English summary
Twelve people, some of them children, were killed in Himachal Pradesh's Chamba district when their vehicle skidded off the road and fell into a 700-metre-deep gorge while they were on their way back from playing a cricket match, police said on Monday. The accident took place on Sunday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X