వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం ఇవ్వలేక సేలం బస్టాండ్‌లో ఆంధ్ర మహిళ కాన్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

No bribe, AP woman delivers at bus stand
చెన్నై: పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ నిండు గర్భిణి వైద్య సిబ్బందికి లంచం చెల్లించుకోలేక బస్టాండులోనే ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రసవ వేదన పడుతున్న పడుతున్న ఓ గర్భిణిని ఆదరించాల్సిన నర్సులు, డబ్బులు డిమాండ్ చేశారు. కూలి పని చేసుకొనే ఆ మహిళ డబ్బులిచ్చుకోలేని పరిస్థితిలో బస్టాండు సమీపంలోని చెట్టు కింద ప్రసవించాల్సి వచ్చింది.

కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన శామ్యూల్, లక్ష్మిలు బతుకుదెరువు నిమిత్తం సేలంలో కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి వెంకటేష్ (5), నవీన్ (2) సంతానం. లక్ష్మి మూడోమారు గర్భం దాల్చింది. ప్రసవ వేదనతో ఆసుపత్రికి వెళ్లింది.

ఆమె భర్త శామ్యూల్‌ను అక్కడి నర్సులు డబ్బులు డిమాండ్ చేశారు. తమ బీద పరిస్థితిని వివరించి కనికరించమని శామ్యూల్ వేడుకొన్నా ఫలితం లేకపోయింది. డబ్బులు లేకుంటే వైద్యం చేయమని నర్సులు నిష్కర్షగా చెప్పి, లక్ష్మిని ఆసుపత్రిలో చేర్చుకొనేందుకు నిరాకరించారు.

ఈ పరిస్థితుల్లో పురిటి నొప్పులు అధికమవ్వడంతో స్థానికులు బస్టాండు సమీపంలోని చెట్టు కిందనే ప్రసవం చేశారు. ఎలాంటి వైద్యసాయం లేకుండానే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. దిక్కుతోచని స్థితిలో తమకు సాయపడిన స్థానికులకు శామ్యూల్కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఓ అంబులెన్సులో ఆమెను అదే ఆసుపత్రికి తరలించారు. విచారణ జరిపిస్తామని ఆసుపత్రి డీన్ చెప్పారు.

English summary
A pregnant woman was allegedly asked to pay a bribe for treatment at a government hospital here today, and unable to pay it, she was forced to deliver the baby at a bus stand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X