కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లెక్చరర్ వేధింపు: హైకోర్టుకు ఎంబియే యువతి లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harassment
హైదరాబాద్/కర్నూలు/గుంటూరు: తనను ఓ లెక్చరర్ వేధిస్తున్నారంటూ ఎంబియే చదువుతున్న ఓ యువతి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు మంగళవారం లేఖ రాశారు. మార్కుల పేరుతో సదరు లెక్చరర్ తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన పద్మజ అనే ఎంబియే విద్యార్థిని ఈ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. తాను చదివే కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న వ్యక్తి తనను నిత్యం ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తెనాలి ఘటనపై హైకోర్టుకు నివేదిక

గుంటూరు జిల్లా తెనాలి ఘటన పైన హైకోర్టుకు జిల్లా కలెక్టర్ ఈ రోజు నివేదిక సమర్పించారు. దీనిపై విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం కూతురు, తల్లి రాత్రి తొమ్మిది గంటల సమయంలో వెళుతుండగా పలువురు కూతురును టీజ్ చేయడం, ఆమెను కాపాడేందుకు తల్లి అడ్డుపోవడంతో ఆమెను లారీకింద తోసేయడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ రోజు కలెక్టర్ నివేదిక సమర్పించారు.

లొంగలేదని ఇంటికి నిప్పు

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తనకు లొంగలేదని ఓ వ్యక్తి ఆమె ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన ఆర్ధరాత్రి జరిగింది. ఓ మహిళ తన భర్త చనిపోవడంతో తల్లి వద్ద ఉంటోంది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. లొంగక పోవడంతో ఇంటికి నిప్పు పెట్టాడు.

English summary
A 9th class girl student was tortured and abused by the teacher in government school in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X