తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో అగ్ని ప్రమాదం: అన్న ప్రసాదాల నిలిపివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Fire accident at Tirumala
చిత్తూరు: తిరుమలలోని శ్రీవారి ఆలయం నిత్యాన్నదాన క్యాంటీన్ గోడౌన్‌లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని నిత్యాన్నదాన సముదాయంలో ప్రమాదం సంభవించినప్పుడు ఎవరూ లేకపోవడంతో ఏమీ కాలేదు. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరో గంటలో మంటలు అదుపులోకి వచ్చే అవకాశముంది.

ఘటన స్థలానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు, జెఈవో శ్రీనివాస రాజు చేరుకున్నారు. పరిస్థితిని వారు సమీక్షిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. నిత్యాన్నదాన గోదాంలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్న ప్రసాదాలను నిలిపివేశారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో శనివారం కూడా అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. శ్రీవారి వడ ప్రసాదం తయారు చేసే పోటులో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక శకటాలు, సిబ్బందితో పాటు, అక్టోపస్ దళాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటి అగ్నిప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు. ఈ రెండు ప్రమాదాలకు షాట్ సర్క్యూటే కారణం.

English summary
Fire accident was averted in the hill temple of Lord Venkateswara at Tirumala today when a fire broke out in the additional kitchen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X