వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జయప్రద పట్ల పోలీసుల దురుసు: భద్రతపై ఆందోళన'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprada-Amar Singh
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రదకు తగిన భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు, రవాణాశాఖ అధికారులు జయప్రద పట్ల దురుసుగా ప్రవర్తించారని అతను షిండేకు సమర్పించిన మెమొరాండంలో పేర్కొన్నారు.

ఈ ఘటన పైన నిష్పాక్షికంగా దర్యాఫ్తు జరపాలని ఆయన షిండేను కోరారు. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అమర్ సింగ్ ఇదే అంశంపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు కూడా మరో విజ్ఞప్తి లేఖను సమర్పించారు.

ఈ నెల 13వ తేదిన జయప్రద తన నియోజకవర్గం రాంపూర్‌లో ఉన్నప్పుడు దాదాపు నలభై మంది మంది పోలీసులతో ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ అధికారులు వచ్చి ఆమె వాహనానికి గల ఎర్ర లైట్‌ను తీసి వేశారని, ఆ సమయంలో వారు జయప్రద పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.

గతంలో బహుజన సమాజ్ వాది పార్టీ ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు ఎర్ర లైటును వినియోగించుకునేందుకు అనుమతించిందని, జయప్రద పట్ల దురుసు ప్రవర్తన వెనుక మంత్రి అజమ్ ఖాన్ ఉన్నారని ఆయన ఆరోపించారు. కాగా, నాలుగు రోజుల క్రితం జయప్రద వాహనానికి ఉన్న ఎర్ర లైటును అధికారులు తొలగించిన విషయం తెలిసిందే.

English summary
Rajyasabha Member Amar Singh on Tuesday asked Home Minister Sushil Kumar Shinde to ensure proper security to MP Jayaprada alleging that policemen in her constituency in UP tried to manhandle her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X