వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఎన్నికల రేసు నుంచి ముషార్రఫ్ అవుట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pervez Musharraf
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఎన్నికల రేసు నుంచి అవుటయ్యాడు. నాలుగు నియోజకవర్గాలకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. దీంతో పర్వేజ్ ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇది ముషార్రఫ్ రాజకీయ ఆకాంక్షలపై పూర్తిగా నీళ్లు చల్లింది.

తాజాగా ఎన్ఎ -32 చిత్రాల్ నియోజకవర్గానికి దాఖలు చేసిన ముషార్రఫ్ నామినేషన్ పత్రాలు మంగళవారం తిరస్కరణకు గురయ్యారు. మిగతా మూడు నియోజకవర్గాల్లో పోటీకి దాఖలు చేసిన పత్రాలు ఇది వరకే తిరస్కరణకు గురయ్యాయి. పాకిస్తాన్ రాజధానిలో, పంజాబ్ ప్రొవిన్స్‌లో పోటీ చేయడానికి ముషార్రఫ్‌కు అవకాశం లేకుండా చేస్తూ ట్రిబ్యునల్ మంగళవారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది.

ఇస్లామాబాద్, కసూర్ నియోజకవర్గాలకు ముషార్రఫ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ట్రిబ్యునల్ సమర్థించింది. కరాచీ పార్లమెంటరీ నియోజకవర్గానికి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తరిస్కరించడాన్ని సమర్థిస్తూ మరో ట్రిబ్యునల్ ఇది వరకే తీర్పు వెలువరించింది.

2007లో అత్యవసర పరిస్థితిని విధించడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారనే కారణంతో రిటర్నింగ్ అధికారులు ముషార్రఫ్ నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ముషార్రఫ్ ప్రయత్నించారు. అయితే, ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. మే 11వ తేదీన పాకిస్తాన్ ఎన్నికలు జరగనున్నాయి.

English summary
Former Pakistan president Pervez Musharraf's aim of contesting the May 11 polls suffered a major setback on Tuesday with the rejection of his candidature in all four parliamentary constituencies for which he had filed nomination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X