వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోస్టన్‌లో ఉగ్రవాద దాడి: ముగ్గురు మృతి, హైఅలర్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Boston - bombing
వాషింగ్టన్: అమెరికాలోని మాసాచూసెట్స్ రాష్ట్రం బోస్టన్‌లో ఉగ్రవాద దాడులు జరిగాయి. రెండు భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో ముగ్గురు మరణించగా, 140 మంది దాకా గాయపడ్డారు. మరణించినవారిలో ఇద్దరు పోలీసులు ఉన్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయి.

బోస్టన్‌‌లో ఓ మారథాన్ నిర్వహించారు. ఈ మారథాన్ ముగింపు రేఖ చేరుతుండగా పేలుళ్లు జరిగాయి. ప్రమాదంలో గాయపడినవారిని హుటాహుటిన మాసాచూసెట్స్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో మరో రెండు బాంబులు వెలుగు చూశాయి. వాటిని నిర్వీర్యం చేశారు.

బాధితులకు అవసరమైన చికిత్స ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన అందించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించారు. బోస్టన్ బాంబు పేలుళ్లు అమెరికా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. మార్కెట్ నష్టాల బాటలో నడిచింది. జంట పేలుళ్ల నేపథ్యంలో అమెరికాలో హై అలర్ట్ ప్రటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బోస్టన్ జంట పేలుళ్ల ఘటనపై మాసాచుసెట్స్ గవర్నర్, బోస్టన్ మేయర్ సమీక్షిస్తున్నారు. పేలుళ్ల ఘటన నుంచి ఒబామా ఖండించారు. పేలుళ్ల అనంతరం ఆయన శ్వేత సౌధం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

పేలుళ్లపై విచారణ జరిపించి, అందుకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని ఒబామా హామీ ఇచ్చారు. పేలుళ్ల అనంతరం చేపట్టిన సహాయక చర్యలపై ఆయన మాసాచుసెట్స్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సంఘటనా స్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. కాళ్లు పోయినవారున్నారు. కొంత మంది స్పృహ తప్పి పడిపోయారు. మృతుల్లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. బాధితుల కోసం అమెరికా ప్రజలు ఈ రాత్రి ప్రార్థనలు చేస్తారని ఒబామా చెప్పారు. ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే, స్వదేశానికి సంబంధించిన శక్తులా, విదేశీ శక్తులా అనేది తెలియడం లేదు.

English summary
US President Barack Obama pledged the "full weight of justice" as two people were killed and more than 100 injured as two powerful explosions detonated in quick succession near the Boston Marathon finish line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X