వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ హవా తగ్గుతోందని తేలింది: సిఓటరు సర్వేపై బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Chandrababu Naidu
హైదరాబాద్/విశాఖపట్నం: కడప పార్లమెంటు సభ్యుడ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 26 నుండి 30 పార్లమెంటు స్థానాలు వస్తాయని గత సర్వేలు చెప్పగా.. తన పాదయాత్రతో పరిస్థితిలు మారిపోయాయని, ఇప్పుడు 12 సీట్లే వస్తాయని సర్వేలో తేలిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీలే జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పారు.

అది మూడో ఫ్రంటో లేక నాలుగో ఫ్రంటో కావొచ్చన్నారు. ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం ఎన్డీయే, యూపీఏ యేతర కూటమే అన్నారు. సి వోటర్ సర్వేపై మంగళవారం రాత్రి టైమ్స్ నౌ నిర్వహించిన చర్చలో చంద్రబాబు ఫోన్ ద్వారా పాల్గొన్నారు. 'గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా అదే చేయనున్నారా? ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నారా?' అని ప్రశ్నించగా... 'ఔను! ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం' అని చంద్రబాబు తెలిపారు.

"గతంలో మేం నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కూటములను సమర్థంగా నిర్వహించాం. అన్ని పార్టీలను కలిపి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో కూడా ప్రాంతీయ పార్టీలదే ప్రధాన పాత్ర అవుతుంది. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోనూ మాదే అధికారం'' అని చంద్రబాబు చెప్పారు.

జాతీయ స్థాయిలో 1996, 1998 నాటి పరిస్థితులు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. "2700 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. లక్షల మంది ప్రజలను కలిశాను. వారి సమస్యలను వింటున్నా'' అని చంద్రబాబు తెలిపారు. జాతీయ నాయకులకంటే ప్రాంతీయ పార్టీల నేతలే నయమని తెలిపారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has responded on C Voters Survey on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X