వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్: గెలవలేకే అని బాబు ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - K Chandrasekhar Rao
హైదరాబాద్/విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి ఆపరేషన్ ఆకర్ష్ పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెరాసకు గెలిచే సత్తా లేదని, ఆ పార్టీకి అసలు కార్యకర్తలే లేరని, అందుకే ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోందన్నారు. నాయకులు వెళ్లిపోవడం టిడిపికేం కొత్త కాదని, కార్యకర్తలు మాత్రం ఎప్పుడు పార్టీ వెంటే ఉంటారన్నారు.

ప్రలోభపెట్టి తీసుకోవడం నాయకులను తీసుకు వెళ్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు మాత్రం నీతి తప్పడం లేదని, వారే తమ ఆస్తి అన్నారు. ఫిరాయింపుల కోసం కూడా డెడ్ లైన్లు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేస్తారని, తరువాత ప్రజలను మోసం చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తుంటారని, కరీంనగర్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేను అలా ప్రలోభపెట్టే తీసుకు వెళ్లారని విమర్శించారు.

2004 కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న తెరాస 50 సీట్లలో పోటీ చేసి 20 సీట్లలో గెలుపొందిందని 2009లో తమతో పొత్తుపెట్టుకుని 40 సీట్లలో పోటీ చేసి పది సీట్లలో మాత్రమే గెలుపొందిందని అన్నారు. సంచలనాల కోసం ఏదో ఒకటి చేయడం తప్ప విజయం దక్కించుకునే సత్తా తెరాసకు లేదన్నారు.

కెసిఆర్ గతంలో తెలంగాణ కోసం డెడ్‌లైన్లు పెట్టేవారని, ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కోసం డెడ్‌లైన్లు పెడుతున్నారని, ఇలాంటి డెడ్‌లైన్లు పెట్టడానికి సిగ్గుపడాలని, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల వారంతా చవటలు, దద్దమ్మలని తిట్టిన కెసిఆర్.. ఇప్పుడు అదే పార్టీల వారి కోసం వెంపర్లాడుతూ, వారి ఇళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. తనతో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సంప్రదింపుల్లో ఉన్నారని కెసిఆర్ గొప్పగా చెబుతున్నారని, అదే నిజమైతే వారి పేర్లు బయటకు చెప్పే దమ్ముందా? అని నర్సిరెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన నళినిని అవమానించి పంపావని, టిడిపి నుంచి బయటకు వెళ్ళిన నాగం జనార్ధన రెడ్డి పట్ల ఎంత అన్యాయంగా వ్యవహరించావో అందరికీ తెలుసునని, అమర వీరుల కుటుంబాలను ఉపన్యాసాల కోసం వాడుకోవడం తప్ప అభ్యర్థులుగా పోటీకి అంగీకరించరని, ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పదవులు, వ్యాపారాలే ముఖ్యమన్నారు. దానికి తెలంగాణ ఉద్యమం ఒక ముసుగు మాత్రమే అన్నారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu has lashed out at TRS chief K Chandrasekhar Rao for his operation Aakarsh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X