వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎం: యుఎస్‌కు సారీ, బెంగళూర్ బ్లాస్ట్‌పై సైలెంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన పేలుళ్లను ప్రధాని మన్మోహన్ సింగ్ ఖండించారు. సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేఖ రాశారు. బెంగళూర్ పేలుళ్ల ఘటనపై బుధవారం సాయంత్రం వరకు కూడా స్పందించలేదు. ఏ విధమైన ప్రకటన కూడా జారీ చేయలేదు.

బెంగళూర్‌లో పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని తేలినా ప్రధాని మన్మోహన్ సింగ్ పెదవి విప్పకపోవడంపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. మన్మోహన్ ఎందుకు మౌనంగా ఉన్నారు, కర్ణాటక రాష్ట్రాన్ని బిజెపి పాలిస్తుండడం వల్లనా, అదీ బిజెపి కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించడం వల్లనా అని ప్రజలు సోషల్ మీడియాలో అడుగుతున్నారు.

కాంగ్రెసు నాయకుడు షకీల్ ఆహ్మద్ మాదిరిగానే ప్రదాని కూడా రాజకీయాలు చేస్తూ మౌనం వహించారా అని ప్రశ్నిస్తున్నారు. దేశ ప్రజలకు సంఘీభావం ప్రకటించాల్సిన బాధ్యత ప్రధానిగా మన్మోహన్ సింగ్‌కు ఉంటుంది. ప్రమాద తీవ్రతతో సంబంధం లేకుండా ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది.

Manmohan tweets

బోస్టన్ పేలుళ్లను బుద్ధి లేని చర్యగా, పిరికిపందల చర్యగా మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. పేలుళ్లను ఖండించడానికి భారత ప్రజలు తన గొంతుతో గొంతు కలుపుతారని ఆయన అన్నారు. బాధితులకు తమ సంఘీభావాన్ని, సానుభూతిని ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. దర్యాప్తులో అమెరికాకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆయన చెప్పారు.

బెంగళూర్ సంఘనటపై కేంద్ర హోం మంత్రి తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరూ స్పందించలేదు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మొక్కుబడిగా ప్రకటన చేశారు.

English summary
Yesterday, Prime Minister Manmohan Singh wrote to US President Barack Obama expressing solidarity with the American people in the wake of Boston bombing, but Singh is yet to issue (till 6 pm) any statement on the Bangalore blast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X