వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేటుకు రెడీ: స్పీకర్‌తో వైయస్ జగన్ వర్గ ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan camp MLAs meet speaker
హైదరాబాద్: పార్టీ విప్‌లు ధిక్కరించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ముగ్గురు శానససభ్యులు గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. తమ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు స్పీకర్‌ను కోరారు. తెలుగుదేశం పార్టీ తిరుబాటు శానససభ్యుడు కొడాలి నానితో పాటు కాంగ్రెసు తిరుగుబాటు శాసనసభ్యులు పేర్ని నాని, మద్దాల రాజేష్ స్పీకర్‌ను కలిశారు.

తాము పార్టీ విప్‌లు ధిక్కరించి, ఓటు వేశామని వారు స్పీకర్ వద్ద అంగీకరించారు. తమపై స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని పేర్ని నాని మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమపై వేటు వేసినా తాము కట్టుబడి ఉంటామని, వేటు వేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. తాము చెప్పిన మాటలకు స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన లేదని అన్నారు. తమపై వేటు వేసిన ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీ 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని, ప్రజలను మోసం చేసింది కాబట్టి తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశానని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి ప్రజావిశ్వాసం కోల్పోయిందని ఆయన విమర్శించారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశానని స్పీకర్‌కు చెప్పినట్లు పేర్ని నాని తెలిపారు. ఉప ఎన్నికలు రాకుండా చేయడానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని, తమపై చర్యల్లో జాప్యం చేస్తోందని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఏ విధమైన విప్ అందలేదని తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. జీవితాంతం తాను కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ యుపిఎకు మద్దతు ఇస్తానని చెప్పడంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు.

తాను పార్టీకీ శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశానని, వాటిని ఆమోదించకుండా విప్ ధిక్కరించావంటూ తనపై ఫిర్యాదు చేయడం సరి కాదని కాంగ్రెసు తిరుగుబాటు శాసనసభ్యుడు మద్దాల రాజేష్ అన్నారు. తమపై వేటు వేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.

English summary

 The Congress rebel MLAs Perni and Maddala Rajesh and the Telugudesam rebel MLA Kodali, spporting YSR Congress party president YS Jagan, met speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X