వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ములాఖత్‌లపై ఆ పార్టీనే అడగాలి: గండ్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

 Gandra Venkataramana Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ములాఖత్‌లపై ఆ పార్టీ నాయకులే విచారణ కోరాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. పోటీ పడి ప్రతిపక్షాలు తమ కాంగ్రెసు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సర్వేలు చూసుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారని ఆయన విమర్శించారు. అధికారంలోకి వస్తానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆయన అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, కాంగ్రెసు పార్టీ విజయం సాధించి తీరుతుందని ఆయన అన్నారు. మంత్రివర్గంలో మార్పులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిధిలోవని ఆయన అన్నారు. చంద్రబాబు యాత్రకు జనం తగ్గుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్ారు. నిరాశానిస్పృహతోనే కమ్యూనిస్టులు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీల మనుగడ కష్టంగా మారిందని చెప్పారు.

పార్టీలన్నీ పొత్తులు నికారించడంతో కమ్యూనిన్టు పార్టీలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. అమ్మ హస్తం పథకంపై సిపిఎం కార్యదర్శి రాఘవులు వ్యాఖ్యలు కమ్యూనిస్టుల నిరాశానిస్పృహలకు అద్దం పడుతున్నాయని గండ్ర అన్నారు. ఉన్న ఒక్క సీటు కూడా కోల్పోతామనే భయంతో సిపిఎం ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. తాము ఎవరినీ బతిమిలాడి విప్ జారీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వచ్చిన తాము ఎదుర్కుంటామని, ఆ సత్తా కాంగ్రెసుకు ఉందని గండ్ర చెప్పారు.

వైయస్ జగన్ ములాఖత్‌లపై హోంశాఖస్థాయిలో విచారణ జరిపించాలని కాంగ్రెసు ఎమ్మెల్సీ కెఆర్ అమోస్ కోరారు. జగన్ విషయంలో హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు అధఘికారులు సక్రమంగానే వ్యవహరిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. జైళ్లలో ఉన్న లోపాలని ప్రభుత్వం సరిదిద్దాలని ఆయన సూచించారు.

English summary
Gocernmebt chief whip Gandra Venkataramana Reddy opibed that YSR Congress should seek enquiry on YS Jagan mulakaths in Chanchalguda jail in Hyderabad. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X