వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరెస్టుకు హైకోర్టు ఆదేశం: పర్వేజ్ ముషర్రాఫ్ పరారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Pervez Musharraf
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అరెస్టుకు పాకిస్తాన్ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తుల ఉద్వాసన కేసులో ముషార్రఫ్ బెయిల్‌ను పొడగించడానికి కోర్టు నిరాకరించింది. కోర్టు ఆవరణ నుంచి ముషార్రఫ్ పారిపోయినట్లు డాన్ అనే మీడియా సంస్థ రాసింది.

ముషార్రఫ్ బెయిల్ దరఖాస్తును న్యాయమూర్తి షౌకత్ అజీజ్ సిద్దిఖీ తిరస్కరించారు. ఆ వెంటనే ముషార్రఫ్ అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే ముషార్రఫ్ వద్దకు చేరుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే, వ్యక్తిగత భద్రతా సిబ్బంది చుట్టుముట్టి ఉండగా ముషార్రఫ్ బుల్లెట్ ప్రూఫ్ నల్లటి ఫోర్ వీలర్‌లో పారిపోయినట్లు డాన్ మీడియా రాసింది.

తాను అధికారంలో ఉన్నప్పుడు ముషార్రఫ్ 2007లో న్యాయమూర్తులపై వేటు వేశారు. ముషార్రఫ్ నాలుగేళ్ల పాటు విదేశాల్లో తలదాచుకున్నారు. గత నెలలోనే ఆయన మే 11వ తేదీన జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి పాకిస్తాన్ తిరిగి వచ్చారు. పాకిస్తాన్ తాలిబాన్ల నుంచి ముప్పు ఉన్నప్పటికీ, వివిధ ఆరోపణల్లో అరెస్టుకు అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు.

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ముషార్రఫ్ తీవ్రంగానే ప్రయత్నించారు. ఇస్లామాబాద్‌లోని నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి ముషార్రఫ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ట్రిబ్యునల్ తిరస్కరించింది. మూడు నియోజకవర్గాల్లోనూ ఆయన నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. చిత్రాల్ నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి స్వీకరించినప్పిటీ పలువురు అభ్యంతరాలు తెలుపుతూ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ చేసే అవకాశం ఆయనకు లేకుండా పోయింది.

English summary
A Pakistan court has ordered the arrest of former president Pervez Musharraf. The Islamabad high court refused to extend his bail in the judges' detention case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X