హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విధులకు సబిత దూరం: కళంకితుల కొనసాగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Dharmana Prasad Rao-Sabitha Indra Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. గతంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా చాలా కాలం విధులకు దూరంగా ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. కళంకిత మంత్రుల విషయంలో పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకోవచ్చుననే ఊహాగానాలు చెలరేగాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో సమావేశమైన తర్వాత వారి విషయంలో అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ కళంకిత మంత్రుల విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. పైగా, వారిని యధాతథంగా కొనసాగించాలని భావిస్తోంది. వైయస్ జగన్ కేసులో ఇరుక్కున్న మోపిదేవి వెంకటరమణ రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించారు. కానీ, ఆ తర్వాత అందుకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి శాఖ మార్చినా, ఆమెకు ఉద్వాసన పలికినా దాని ప్రభావం ప్రభుత్వంపై పడవచ్చునని భావించి, చర్యలకు అధిష్టానం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వీరిద్దరి చేత రాజీనామాలు చేయిస్తే, మరో ముగ్గురు మంత్రులపై కూడా చర్యలు తీసుకోవాల్సి రావచ్చునని, అది ఒక గొలుసుకట్టు వ్యవహారంగా మారుతుందని అధిష్టానం భావిస్తోంది.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వివాదాస్పద జీవలు జారీ చేసిన వ్యవహారంలో మంత్రులు గీతారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్యలను కూడా సిబిఐ నిందితులుగా చేర్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులపై చర్యలు తీసుకోకపోతే మిగతావారి విషయంలో కూడా అదే పద్ధతిని అనుసరించడానికి వీలవుతుందని అంటున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో పూర్తిగా సిబిఐ అన్ని చార్జిషీట్లను దాఖలు చేసిన తర్వాత కళంకిత మంత్రులపై ఒకేసారి చర్యలు తీసుకోవచ్చునని అధిష్టానం భావిస్తోంది.

గత వారం నుంచి సబితా ఇంద్రారెడ్డి విదులకు హాజరు కావడం లేదు. సచివాలయంలో కూడా కనిపించడం లేదు. ధర్మాన ప్రసాదరావు ఆరు నెలల పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు, విధులకు దూరంగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా చెప్పినా ఆయన వినలేదు. ఇటీవలి కాలంలో ఆయన విధులకు హాజరవుతున్నారు. అయితే, రోడ్లు, భవనాల మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు క్రమం తప్పకుండా ఫైళ్లను చూడకున్నా పెద్దగా ప్రభావం చూపదు. కానీ హోం మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఎప్పటికప్పుడు నిరంతరం ఫైళ్లను చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ సబితా ఇంద్రారెడ్డి శాఖను కూడా మార్చే అవకాశాలు లేవని అంటున్నారు.

English summary
Home Minister Sabitha Indra Reddy is following the footsteps of roads and buildings minister Dharmana Prasada Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X