హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెకె పదవిపై విహెచ్ వ్యాఖ్య: కిరణ్, కెవిపిలపై నిప్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
హైదరాబాద్: తెలంగాణ గురించి మాట్లాడినందుకే సీనియర్ పార్టీ నేత కె కేశవ రావు పదవి ఊడిపోయిందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు శుక్రవారం అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ సభ్యులు ఎవరు కూడా పార్టీని వీడరన్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్తే గెలుస్తామనే ధీమాతో మారాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను తొలగించినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. మంత్రులను కాపాడుకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెసుకు ఓటేయరన్నారు. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ భూములను ప్రయివేటుకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.

అంబరుపేటలో ప్రభుత్వ పాఠశాల భూమిని దారాదత్తం చేశారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని లేదంటే తాను దీక్షకు దిగుతానని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు అండ చూసుకొని పలువురు రెచ్చి పోతున్నారని ఆరోపించారు. సర్వే నెంబరు చెబితే ఏ భూమి ఎక్కడుందో కెవిపి చెప్పగలరని విమర్శించారు.

తెరాస ప్రజల పక్షం.. రాజయ్య

తాను ప్రజల పక్షమేనని, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ప్రజల పక్షమేనని వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. వరంగల్ ప్రజల ఆదేశం మేరకు తాను నడుచుకుంటానని చెప్పారు. బయ్యారం గనుల కేటాయింపులను రద్దు చేయాలని, తెలంగాణ ఖనిజ వనరులను సీమాంధ్రకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే తాను పార్టీ మారే విషయమై ఆలోచిస్తానని పెద్దపల్లి ఎంపి వివేక్ అన్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని, తెలంగాణ మంత్రులు దీనిపై పోరాడాలని ఆయన సూచించారు.

English summary
Congress Party senior leader and RS MP V Hanumanth Rao has lashed out at Kiran Kumar Reddy and MP KVP Ramachandra Rao on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X