వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోటో: బోస్టన్ బంబార్లు బ్రదర్స్, రష్యన్ కాకస్‌వాళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

బోస్టన్: అమెరికాలోని బోస్టన్‌లో పేలుళ్లకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. రెండో అనుమానితుడిని 19 ఏళ్ల ద్జోఖర్ త్సార్నేవ్‌గా గుర్తించారు. అతని కోసం బోస్టన్ శివారులోని వాటర్‌టౌన్‌లో గాలిస్తున్నారు. మరో అనుమానితుడు మరణించాడు. అతన్ని తామెర్లాన్ త్సార్నేవ్‌గా గుర్తించారు. వారిద్దనిరి సోదురులుగా భావిస్తున్నారు.

సోదురులైన వారిద్దరు రష్యన్ కాకసస్‌కు చెందినవారు. చాలా చిన్న వయస్సులోనే వారిద్దరు కజకిస్థాన్ చేరుకున్నారు. ఆ తర్వాత అమెరికాకు వచ్చారు. చాలా ఏళ్ల క్రితమే వారు అమెరికా వచ్చారు. నోటీసు ఇచ్చే వరకు అన్ని రకాల ప్రభుత్వ రవాణాను, టాక్సీ సర్వీసులను నిషేధించారు. విమానయాన అధికార యంత్రాంగం విమానా సర్వీసులను నిలిపేసింది. అనుమానంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని బోస్టన్ పోలీసు కమిషనర్ ఎడ్వర్డ్ డేవిస్ ప్రజలను కోరారు.

తలుపులు మూసుకుని ఇళ్లలోనే ఉండాలిని మాసాచుసెట్స్ గవర్నర్ డేవల్ పాట్రిక్ ప్రజలకు సూచించారు. బోస్టను పోలీసులు వస్తే తప్ప తలుపులు తీయవద్దని ఆయన సూచించారు. ఎఫ్‌బిఐ ఇద్దరు అనుమానితుల చిత్రాలను విడుదల చేసింది.

డ్రామా ఎలా ప్రారంభమైంది..

Boston Marathon

అమెరికా కాలమాన ప్రకారం గురువారం పొద్దుపోయిన తర్వాత 7/11 కన్వినీయెన్స్ దోపిడీతో డ్రామా ప్రారంభమైంది. దీని తర్వాత ఎఫ్‌బిఐ అనుమానితుల చిత్రాలను విడుదల చేసింది. కారులో కూర్చున్న మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంబ్రిడ్జీ పోలీసు ఆఫీసర్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు బాంబర్లే బాధ్యులని పోలీసులు అనుమానిస్తున్నారు.

పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సోదరులు తుపాకి గురి పెట్టి కేంబ్రిడ్జీ నుంచి మెర్సిడీస్ కారును హైజాక్ చేశారు. అర గంట తర్వాత డ్రైవర్‌ను విడుదల చేశారు. పోలీసులు వారిని వెంటాడారు. దాంతో వాళ్లు పేలుడు పదార్థాలు విసిరారు, పోలీసు అధికారులపై కాల్పులు జరిపారు. అధికారులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో తామెర్లాన్ గాయపడ్డాడు. అతను బెత్ ఇజ్రాయెల్ ఆస్పత్రిలో మరణించాడు. అతనికి బుల్లెట్ గాయాలున్నాయి. ద్జోఖర్ పారిపోయినట్లు భావిస్తున్నారు.

English summary
Boston police have confirmed that Suspect 2 is 19 year-old Dzhokhar Tsarnaev of Cambridge, Massachusetts. The hunt for Dzhokhar is on at Watertown, a suburb of Boston. It has also been confirmed that the dead suspect is Tamerlan Tsarnaev.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X