బోస్టన్ మారథాన్ పేలుళ్ల అనుమానితుడి కాల్చివేత

కాగా, అమెరికాలోని మాసాచూసెట్స్ రాష్ట్రం బోస్టన్‌లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. రెండు భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో ముగ్గురు మరణించగా, 140 మంది దాకా గాయపడ్డారు. మరణించినవారిలో ఇద్దరు పోలీసులు ఉన్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయి. బోస్టన్‌లో ఓ మారథాన్ నిర్వహించారు. ఈ మారథాన్ ముగింపు రేఖ చేరుతుండగా పేలుళ్లు జరిగాయి.
ప్రమాదంలో గాయపడినవారిని హుటాహుటిన మాసాచూసెట్స్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో మరో రెండు బాంబులు వెలుగు చూశాయి. వాటిని నిర్వీర్యం చేశారు. బాధితులకు అవసరమైన చికిత్స ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన అందించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించారు. బోస్టన్ బాంబు పేలుళ్లు అమెరికా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.
మార్కెట్ నష్టాల బాటలో నడిచింది. జంట పేలుళ్ల నేపథ్యంలో అమెరికాలో హై అలర్ట్ ప్రటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బోస్టన్ జంట పేలుళ్ల ఘటనపై మాసాచుసెట్స్ గవర్నర్, బోస్టన్ మేయర్ సమీక్షిస్తున్నారు. పేలుళ్ల ఘటన నుంచి ఒబామా ఖండించారు. పేలుళ్ల అనంతరం ఆయన శ్వేత సౌధం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పేలుళ్లపై విచారణ జరిపించి, అందుకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని ఒబామా హామీ ఇచ్చారు.