వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోస్టన్ మారథాన్ పేలుళ్లు: రెండో అనుమానితుడి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Boston Blasts
బోస్టన్: అమెరికాలోని బోస్టన్ పేలుళ్ల ఘటనకు సంబంధించి పోలీసులు రెండో అనుమానితుడిని అరెస్టు చేశారు. ఈ నెల 15వ తేదీన జరిగిన పేలుళ్లలో ముగ్గురు మరణించారు. 180 మంది గాయపడ్డారు. పేలుళ్ల కేసులో రెండో అనుమానితుడు ద్జోఖర్‌ త్సెర్నేవ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి అతన్ని కస్డడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వెస్ట్‌టౌన్‌లోని ఓ ఇంటి వెనక పడవను పోలీసులు చుట్టుముట్టారు. చివరిసారిగా దానికి కొద్ది దూరంలో త్సర్నేవ్ (19)ను కనిపించడంతో పడవలో అతను దాక్కుని ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. లొంగిపోవాల్సిందిగా త్సర్నేవ్‌ను పేరు పెట్టి పిలిచారు. మరో అనుమానితుడు, ద్జోఖర్ సోదరుడు శుక్రవారం ఉదయం పోలీసుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే.

ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు గుర్తించి, పట్టుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాకా ఒబామా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బోస్టన్ ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ద్జోఖర్‌ను పోలీసులు పడవలో దాక్కుని ఉండగా పట్టుకున్నారు. ఈ సయమంలో కొద్దిపాటి ఎదురు కాల్పులు జరిగినట్లు కూడా తెలుస్తోంది. వేట పూర్తయిందని, రెండో నిందితుడిని కూడా పట్టుకున్నామని, న్యాయం గెలిచిందని, అనుమానితుడు కస్టడీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

అతన్ని పట్టుకున్న విషయాన్ని బోస్టన్ మేయర్ టామ్ మెనినో ట్వీట్ చేశాడు. అతడు దొరికాడని అన్నారు.

English summary
The second suspect of the deadly Boston blasts of April 15 that head killed 3 people and injured nearly 180, Dzokhar Tsaernev, was confirmed to be in police custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X