వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా: కృష్ణా ఫస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parthasarathi
హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో అమ్మాయిల హవా కొనసాగింది. మంత్రి పార్థసారథి ఆదివారం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. 54.6 శాతం మంది విద్య్రార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో, మహబూబ్ నగర్ జిల్లా ఆఖరి స్థానంలో ఉంది.

బాలికల ఉత్తీర్ణత శాతం 59.46, బాలుర ఉత్తీర్ణత శాతం 50.22గా ఉంది. ఏ గ్రేడ్ 43 శాతం, బి గ్రేడ్ 32 శాతం, సి గ్రేడ్ 16.9 శాతం, డి గ్రేడ్ 7.7 శాతం విద్యార్థులు పొందారు. వొకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం 46.54గా ఉంది. మొత్తం 4,86,658 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో బాలికలు 2,62,339 కాగా బాలురు 2,35,316.

జిల్లాలలో ఉత్తీర్ణత శాతం: శ్రీకాకుళం జిల్లా - 52 శాతం, తూర్పుగోదావరి - 54, పశ్చిమగోదావరి - 58
గుంటూరు - 63, ప్రకాశం - 53, నెల్లూరు- 64, చిత్తూరు- 58 కర్నూలు - 52, అనంతపురం- 45,
కడప- 50, ఆదిలాబాద్- 48, మెదక్- 41 రంగారెడ్డి- 64, నిజామాబాద్- 41, కరీంనగర్- 47
ఖమ్మం- 51, వరంగల్- 46, నల్గొండ- 41, హైదరాబాద్- 55, విజయనగరం - 49 శాతం

మే 22 నుండి సప్లిమెంటరీ.. పార్థసారథి

మే 22 నుండి సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి పార్థసారథి చెప్పారు. మే 3లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత లేని వారితో పేపర్లు దిద్దించామన్నది అవాస్తవమని చెప్పారు. అర్హత ఉన్న వారితో కూడా రోజుకు 30 పేపర్లు మాత్రమే దిద్దించామన్నారు. ఈ నెల 25 లేదా 26న ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

English summary
Minister Parthasarathi has released Intermediate first year results on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X