హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంకరన్నకు ముందస్తు బెయిల్: సంజయ్‌దత్‌కి వారెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

shankar rao
హైదరాబాద్/ముంబై: మాజీ మంత్రి శంకర రావుకు ముందస్తు బెయిల్ లభించింది. గ్రీన్ ఫీల్డ్ భూవివాదం కేసులో శంకర రావుకు నాంపల్లి న్యాయస్థానం సోమవారం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. గ్రీన్ ఫీల్డ్ వ్యవహారంలో శంకర రావు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో కొద్ది నెలల క్రితం శంకర రావును ఇంటి నుండి తీసుకు వెళ్లిన అంశం వివాదమైన విషయం తెలిసిందే. విచారణ పేరుతో లుంగీ పైనే ఉన్న శంకర రావును పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లారని శంకర రావు, విచారణకు సహకరించకుంటే తీసుకు వచ్చామని, లుంగీ మార్చుకోమంటే అలాగే వస్తానని అతనే చెప్పారని పోలీసులు అప్పుడు చెప్పారు.

అనంతరం ఆయనకు అనారోగ్యం ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత డిశ్చార్జి అయ్యారు. గ్రీన్ ఫీల్డు వ్యవహారంలో శంకర రావుకు మద్దతిచ్చిన వారున్నారు. అలాగే వ్యతిరేకించిన వారు ఉన్నారు. తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని శంకర రావు కూతురు సుస్మిత కూడా పలుమార్లు మీడియా ముందుకు వచ్చింది.

సంజయ్‌దత్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష పడిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు మరొక కష్టం వచ్చిపడింది. ఆయనకు ముంబై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. సంజయ్ దత్ సినిమా షూటింగ్‌కు హాజరుకాలేదని ఓ నిర్మాత ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు సంజయ్‌దత్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

English summary
Former Minister Shankar Rao got anticipatory bail on Monday from Nampally court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X