వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాద్దాంతం చేస్తే..: తెలంగాణ నేతలకు గంటా వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganta Srinivas Rao
విశాఖపట్నం: బయ్యారం గనుల కేటాయింపులపై అనవసరంగా రాజకీయం చేయవద్దని మంత్రి గంటా శ్రీనివాస రావు తెలంగాణ నేతలను హెచ్చరించారు. జాతీయ సంపదపై రాద్ధాంతం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలో బయ్యారం గనుల కేటాయింపుపై విశాఖ స్టీల్ ప్లాంటులో కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాస రావు హాజరై మాట్లాడారు.

జాతీయ సంపదపై రాద్దాంతం చేయడం తెలంగాణ నేతలకు సరికాదన్నారు. ఎవరు అడ్డుకున్నా బయ్యారం గనులను విశాఖ స్టీల్స్‌కు కేటాయిస్తామన్నారు. బయ్యారం ఉక్కును విశాఖ స్టీల్స్‌కు అడ్డుకుంటే కెజి బేసిన్ గ్యాస్‌ను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. తమకు ఎవరినీ రెచ్చగొట్టే ఉద్దేశ్యం లేదన్నారు. ఇతరులు రెచ్చగొడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు.

తెలంగాణ నేతలు ప్రాంతీయతత్వంతో వ్యవహరించడం మానుకోవాలన్నారు. తెలంగాణకు గ్యాస్, పెట్రోలు, పాలు ఆంధ్రా ప్రాంతం నుండే వెళ్తున్నాయన్నారు. వాటిని ఆపేస్తామంటే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. బయ్యారం గనులను విశాఖ స్టీల్స్‌కు కేటాయించడాన్ని తెలంగాణ నేతలు తప్పు పడుతున్న విషయం తెలిసిందే.

తెలంగాణ సహజ వనరుల్లో ఒక్క ఇనుప ఖనిజం ముక్కను ఆంధ్రాకు తరలించినా తెలంగాణ అగ్నిగుండమే అవుతుందని టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఆదివారం హెచ్చరించారు. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు డిమాండ్‌తో.. ఆయనతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సోమారపు సత్యనారాయణ, టి.రాజయ్య, మొగులూరి భిక్షపతి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డిల బృందం ఆదివారం వరంగల్ జిల్లా గూడూరు, ఖమ్మం జిల్లా బయ్యారం ఇనుప ఖనిజం గుట్టల్ని సందర్శించింది.

English summary

 Minister Ganta Srinivas Rao on Monday alleged that Telangana leaders Bayyaram mines slogan is political gimmick.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X