వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయ్యారం సెగ: బొత్సపై గండ్ర, మంత్రి రాంరెడ్డి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: బయ్యారం గనులపై పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చిచ్చు పెడుతున్నాయి. సొంత పార్టీ నాయకుల నుంచే ఆయనకు వ్యతిరేకత ఎదురవుతోంది. బయ్యారం ఉక్కు పరిశ్రమకు సరిపోదన్న బొత్స వ్యాఖ్యలను ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మంతి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బయ్యారం ముడి ఇనుము ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సరిపోదన్న బొత్స వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని గండ్ర వెంకట రమణా రెడ్డి తెలిపారు.

బయ్యారం ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ పెట్టాల్సిందే అని, బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలానేది తెలంగాణ ప్రజల డిమాండ్ అని ఆయన అన్నారు. రూ.4 వేల కోట్ల వ్యయంతో సమీకృత ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని విపక్షాలు రాజకీయం చేయడం తగదని గండ్ర అన్నారు.

ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర వహించాలే తప్ప రాజకీయాలు చేయడం తగదని ఆయన అన్నారు. అన్న జైలులో ఉన్నందున పార్టీ బతుకుతుందో లేదో అనే భయంతో షర్మిల పాదయాత్ర చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిరాశానిస్పృహలతో పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.

బయ్యారం గనులపై బొత్స చేసిన వ్యాఖ్యలను మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. బయ్యారం గనుల వ్యవహారంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. సిపిఐ శాసనసభ్యురాలు చంద్రావతి తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.

English summary
PCC president Botsa Satyanarayana is facing opposition from his own partymen on the Bayyaram mines. Chief Whip Gandra Venkataramana Reddy and Minister Ramreddy Venkat Reddy opposed Botsa's opinian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X