హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరంలో వడగళ్ల వాన: కూలిన చెట్లు, విరిగిన హోర్డింగ్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rain
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల మంగళవారం వడగళ్ల వాన కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోను పలుచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. ఎండలతో మండుతున్న నగరం వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి.

జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, ఉప్పల్, కుషాయిగూడ, అమీర్‌పేట, కోఠి, ఆబిడ్స్, దిల్‌సుఖ్ నగర్, ఘటకేసర్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వడగళ్ల వర్షాన్ని చూసి ప్రజలు ఆనందంలో మునిగితేలారు. బీహార్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఈ కారణంగా దేశవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 8 నుంచి పది డిగ్రీల మేర తగ్గాయి. కోస్తాంధ్ర జిల్లాలో నాలుగు నుంచి 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశముందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

పాకాలలో 8, దేవరకోండలో 6, తెనాలి, నర్సీపట్నం, వింజమూరుల్లో 5, ప్రత్తిపాడు, తిరుపతిలో 4, రావురు, పెద్దపురం, గుడివాడలో మూడు సెంటిమీటర్ల వర్షం నమోదయింది. ఎండకాలంలో చిరు జల్లులు కురవడంతో నగరం చల్లని వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాదులో పలుచోట్ల వర్షం కారణంగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్‌ను మళ్లించారు. బోడుప్పల్‌లో హోర్డింగ్ విరిగిపడింది. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.

ఆటో లారీ ఢీ

మెదక్ జిల్లా సదాశివపేట మండలం పెద్దాపురం గ్రామం వద్ద ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది.

English summary
Heavy rains and gale disrupted normal life in many parts of the state and capital city Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X