వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకే అందరి అండ: జూఎన్టీఆర్ ఒంటరి ఒంటరయ్యారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: నందమూరి హీరో యంగ్ టైగర్ కుటుంబంలో ఎన్టీఆర్ ఒంటరయ్యారా? అంటే అవుననే అంటున్నారు. జూనియర్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, హీరో నందమూరి బాలకృష్ణతో విభేదాలు ఉన్నాయనే వాదనలు ఇటీవల జోరుగా వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎవరికి వారు వివరణ ఇచ్చుకున్నారు. జూనియర్‌తో విభేదాలు ఎలాంటి విభేదాలు లేవని చెబుతూనే.. ఫ్లెక్సీ రాజకీయాలపై ఎన్టీఆర్ స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు.

బాద్‌షా సినిమా విజయోత్సవంలో జూనియర్ మాట్లాడుతూ... తనకు సంబంధం లేని విషయాల్లోకి తనను లాగవద్దని, తన మద్దతు మాత్రం తెలుగుదేశం పార్టీకే ఉంటుందని చెప్పారు. అంతకుముందు వరంగల్ జిల్లాలో నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ.. జూనియర్ ఫోటో వాడుకునే విషయం తెలియనప్పుడు హెచ్చరికలు ఏమిటని, చెప్పాల్సింది చాలా ఉందని బాలకృష్ణను, టిడిపిని ఉద్దేశించి అన్నారు.

ఆ తర్వాత నందమూరి హీరోలు వరుసగా వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హీరో కల్యాణ్ రామ్, కలవగా ఈ రోజు నందమూరి తారకరత్న కలిశారు. ఆయనతో పాటు కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా పరోక్షంగా జూనియర్‌కు చెక్ పెట్టే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారంటున్నారు.

జూనియర్ ప్రణాళికతో బాలయ్య వెళ్తుండటం, వరుసగా నందమూరి హీరోలు బాబును కలుస్తుండటాన్ని చూస్తుంటే ఎన్టీఆర్ ఒంటరి అయినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు. జూనియర్‌కు హరికృష్ణ మద్దతివ్వడం ఆయన మరో తనయుడు కల్యాణ్ రామ్‌కు కూడా ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే అతను బాబును కలుసుకున్నారని చెబుతున్నారు. ఆయనకు కేవలం తన తండ్రి హరికృష్ణ మద్దతు మాత్రమే ఉందంటున్నారు.

మరోవైపు బాబు తనయుడు నారా లోకేష్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. జూనియర్‌కు అందరూ దూరమవుతున్న సమయంలో తాను మాట్లాడితే మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశ్యంతో లోకేష్... ఈ కుటుంబ విభేదాలపై పెదవి విప్పడం లేదంటున్నారు. కుటుంబ విభేదాలపై లోకేష్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. అది వ్యూహాత్మకమే అంటున్నారు. హరికృష్ణ వ్యాఖ్యలు చూసినా జూనియర్ ఒంటరయ్యారని చెప్పక తప్పదని చెబుతున్నారు.

English summary
Heros Nandamuri Tarakarathna, Kalyan Ram and Balakrishna are supporting TDP chief Nara Chandrababu Naidu. Only Harikrishna is supporting Jr NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X