వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముడుపులు: అద్వానీపై తీవ్ర ఆరోపణ, యడ్డీ క్షమాపణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

LK Advani - B S Yeddyurappa
బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల తేది సమీపిస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీపై కర్నాటక జనతా పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆదివారం నాటి ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు కెజిపి అధినేత యడ్యూరప్పపై మండిపడ్డారు. అవినీతిపరులకు తమ పార్టీలో చోటు లేదన్నారు. దీనికి ప్రతిగా కెజిపి నేత ధనంజయ కుమార్ బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి నేతలకు లేదని, ఆ పార్టీ అగ్రనేత అద్వానీతో సహా బిజెపి నేతలంతా యడ్యూరప్ప వద్ద ముడుపులు అందుకున్నవారేనని, ఇలా డబ్బులు మింగి దగా చేశారని ధ్వజమెత్తింది. బెంగళూరులో సోమవారం ఆ పార్టీ సీనియర్ నేత, యడ్యూరప్ప అనుచరుడు ధనుంజయకుమార్ మీడియాతో మాట్లాడారు. అక్రమ గనుల వ్యవహారంలో లోకాయుక్త నివేదిక వెలుగు చూసిన తర్వాత యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించేందుకు అద్వానీతో సహా పలువురు పార్టీ జాతీయ నేతలు కోట్లాది రూపాయల ముడుపులందుకున్నారని చెప్పారు.

ఎవరికి ఎంత మొత్తం ముట్టజెప్పిందీ తమ వద్ద తగిన ఆధారాలున్నా యన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే యడ్యూరప్ప ముడుపులు చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. అయినా కూడా కృతజ్ఞత ఏమాత్రం లేని జాతీయ నేతలు ఆయన పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ సీరియస్‌గానే ఎన్నికల బరిలోకి దిగిందని, 200 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించిందని ఆయన పేర్కొన్నారు.

కాగా, ధనంజయ్ కుమార్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘానికి బిజెపి ఎమ్మెల్సీ మధుసూదన రావు ఫిర్యాదు చేశారు. ధనుంజయ్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. ఆయన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినవని ధ్వజమెత్తారు. ధనంజయ కుమార్‌కు ఈసి నోటీసులు జారీ చేసింది.

యడ్యూరప్పను పార్టీ విడిచి వెళ్లాలని తాము ఎప్పుడూ ఆదేశించలేదని, ఆయనే పీకల్లోతు అవినీతిలోకూరుకుపోయి ముఖం చూపలేక పార్టీని వీడారని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ పేర్కొన్నా రు. బెల్గాంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పులు చేసేవారికి పార్టీ లో స్థానం లేదని అంటూనే ఒక వేళ పశ్చాత్తాపం చెందితే క్షమించి అక్కున చేర్చుకునే దయాగుణం తమ పార్టీ సొంతమన్నారు.

యడ్డీ క్షమాపణ

అద్వానీపై తమ పార్టీ నేత ధనంజయ కుమార్ చేసిన ఆరోపణలకు పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప క్షమాపణలు చెప్పారు.

English summary
Mud-slinging by the KarnatakaJanata Party (KJP) turned nasty with party campaign committee chairman V Dhananjay Kumar on Monday accusing BJPpartriarchLKAdvani's children of taking ''suitcases'' from the chief ministers of the BJP ruled states including former Karnataka chief minister B S Yeddyurappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X