వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్ అవినీతిపరుడే, 6గురు మంత్రులూ: శిక్ష పడాలి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్/ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మంగళవారం ఆరోపించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు. జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రులు కూడా అవినీతిపరులేనన్నారు. ఓబుళాపురంపై రాజకీయం తగదని ఆయన అన్నారు.

ఓబుళాపురంలో ఇనుప ఖనిజం నాణ్యత 70-80 శాతమని, బయ్యారంలోనిది 40 శాతమేనని చెబుతున్న ప్రభుత్వం నాణ్యమైన గనులను విశాఖ ఉక్కుకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. బయ్యారం ఖనిజాన్ని తీసుకెళ్లడం ద్రోహమంటున్న కొందరి వాదన అవకాశవాదమేనన్నారు. బయ్యారం ఖనిజంతో స్టీల్ ప్లాంట్ పెట్టడం అసాధ్యమని, బయటినుంచి నాణ్యమైన ఖనిజాన్ని కలపాల్సి ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఈ వివాదాన్ని సృష్టిస్తే టిడిపి, తెరాస వంటి పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం దీన్ని వాడుకుంటున్నాయని విమర్శించారు. బయ్యారంలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటు అసాధ్యమన్న బొత్స వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ఆయన కేబినెట్లో గోళ్లు గిల్లుకుంటున్నారా? తనకు, ముఖ్యమంత్రికి పడదు.. తాను స్పెషల్ అని చెప్పుకోవాలనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు.

బయ్యారం ఉక్కు రాష్ట్ర ప్రజల హక్కు: నారాయణ

బయ్యారం ఉక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ సాధించేవరకు పోరాటం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష ప్రారంభమైంది.

ఖమ్మం బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని నారాయణ ప్రారంభించి, ప్రసంగించారు. విద్యుత్ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం కిరణ్.. విశాఖ ఉక్కు పరిశ్రమకు బయ్యారం గనులను కేటాయించే నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ఈ కుట్రలో కేసీఆర్, టీఆర్ఎస్ శ్రేణులు పడి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దని కోరారు.

English summary

 CPM state secretary Raghavulu said that YSR Congress Party chief YS Jaganmohan Reddy is corrupt. Raghavulu wants seet factory in Khammmam to use iron ore from Bayyaram mines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X