వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయ్యారం: లగడపాటి తెలంగాణవాదం!, తాట తీస్తారని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: ప్రభుత్వ పనులను అఢ్డుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాట తీస్తారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బుధవారం హెచ్చరించారు. ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బయ్యారం గనుల విషయంలో రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారని ఆరోపించారు.

తెరాస ఉద్యమాలకు జనమే కరువయ్యారని విమర్శించారు. బయ్యారం గనుల విషయమై మాట్లాడుతూ... బయ్యారంలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. గతంలో ప్రయివేటు కంపెనీలకు అప్పగిస్తే నోరు మెదపని కెసిఆర్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బయ్యారం గనుల విషయమై తెలంగాణ నేతలు బయ్యారంలోనే ఫ్యాక్టరీ నిర్మించాలని చెబుతుండగా సీమాంధ్ర నేతలు మాత్రం విశాఖకే అంటున్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి బయ్యారంలో ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పడం గమనార్హం.

కాంగ్రెసు పార్టీ ఒక్కరిపై ఆధారపడలేదు

కాంగ్రెసు పార్టీ ఏ ఒక్కరి పైనా ఆధారపడి లేదని లగడపాటి చెప్పారు. కొందరు నాయకులు పార్టీని వీడినా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెసు పార్టీలో వలసలు సాధారణమే అన్నారు. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం కాంగ్రెసు వెన్నంటే ఉంటారని లగడపాటి చెప్పారు.

కాగా అంతకుముందు బొత్స హైదరాబాదులో మాట్లాడుతూ... రక్షణ స్టీల్స్ డైరెక్టర్లు, కార్యాలయాల అడ్రసులు చూస్తే ఎవరివో తెలుస్తుందని అన్నారు. రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనుల కేటాయింపు వ్యవహారం మంత్రివర్గం దృష్టికి రాలేదన్నారు. ఉత్తర్వులు వచ్చినప్పుడు తనతో సహా కొందరు తప్పు పట్టారని, రక్షణ స్టీల్స్ ఎవరిదో, కొండల రావు ఎవరో అందరికీ తెలుసునని అన్నారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal has supported steel factory in Bayyaram of Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X