వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలికపై రేప్: లంచం ఇవ్వజూపిన పోలీసు దొరికాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Girl
న్యూఢిల్లీ: ఐదేళ్ల బాలికపై ఢిల్లీలో జరిగిన అత్యాచారం కేసును తుడిచిపెట్టడానికి ఆమె కుటుంబ సభ్యులకు లంచం ఇవ్వజూపిన పోలీసు దొరికాడు. బాలిక తండ్రి ఆ పోలీసును గుర్తించాడు. ఫిర్యాదు చేయకపోతే 2 వేల రూపాయలు ఇస్తామని పోలీసులు బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడు. నిందితుడిని తాము గుర్తించామని, అయితే పేరు చెప్పనని పోలీసు చెప్పాడు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం - పోలీసు స్టేషన్‌లోని 13 మంది పోలీసుల ఫొటోలను బాలిక తండ్రికి చూపించారు. వారిలో తమకు లంచం ఇవ్వజూపిన పోలీసును అతను గుర్తించాడు. తండ్రి అందుబాటులో లేనందున నిందితుడ్ని గుర్తించలేకపోయామని ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ మంగళవారంనాడు చెప్పారు.

ఐదేళ్ల బాలికను ఈ నెల 15వ తేదీన అపహరించి, రెండు రోజుల పాటు బందీగా పెట్టుకుని ఆమెపై అత్యాచారం జరిపారు. బాలిక కుటుంబం నివసించే అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే నిందితులు కూడా ఉంటున్నారు. బాలిక అరుపులు విని ఆమెను ఈనెల 17వ తేదీన కుటుంబ సభ్యులు రక్షించారు.బాలికకు ఎయిమ్స్ చికిత్స అందిస్తున్నారు.

ఇద్దరు వ్యక్తులు బాలికను అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక స్పృహ తప్పిన తర్వాత కూడా ఆమెపై అత్యాచారం చేసినట్లు కేసులో రెండో నిందితుడైన 19 ఏళ్ల ప్రదీప్ కుమార్ చెప్పాడు. ప్రధాన నిందితుడు మనోజ్ కుమార్ తొలుత నిందలన్నీ ప్రదీప్ కుమార్‌పైనే వేయడానికి ప్రయత్నించాడు. ప్రదీప్ కుమార్, మనోజ్ కుమార్ ఇద్దరు బాలికపై దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఆత్యాచారం జరిపిన తర్వాత ఇద్దరు కూడా బీహార్‌లోని తమ సొంత పట్టణానికి పారిపోయారు. వారిని అరెస్టు చేసి పోలీసులు ఢిల్లీకి తీసుకుని వచ్చారు.

English summary
he policeman who bribed the family of the 5 year old rape victim was identified by the victim's father. According to the complaint by the victims father, the policeman dissuaded the family from filing an FIR and offered them Rs 2000 to back-off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X