వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ చింతచెట్టు కింద కూర్చుంటే ఎమ్మెల్యేగా గెల్చినట్టే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Tamarind tree brings luck for candidates
బెంగళూరు: మే 5వ తేదిన జరుగనున్న ఎన్నికల కోసం కర్నాటకలో ఆయా పార్టీలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులు తమ గెలుపు కోసం గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. తమను గెలిపించాల్సిందిగా అభ్యర్థులు దేవుడని అభ్యర్థిస్తుంటారు. దేవుడు, ఓటరు దేవుళ్లతో పాటు ఉత్తర కర్నాటకలోని రోన్, శిరహట్టి నియోజకవర్గ అభ్యర్తులు ఓ చింతచెట్టు కింద కూడా సేద తీరుతుంటారు.

దీనికి కారణం ఆ చింత చెట్టు కింద కూర్చుంటే విజయం వరిస్తుందనే నమ్మకమే. ఈ చెట్టు గడగ్ జిల్లాలోని ముందర్గి తాలుకాలోని హేమరెడ్డి చౌరస్తాలో ఉంది. రోన్, శిరహట్టి నియోజకవర్గాల నుండి పోటీ చేసే అభ్యర్థులు పలువురు ఈ చెట్టు కిందే కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకోవడం, అక్కడే గ్రామంలోని పలువురి ఓటర్లను ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తుండటం చేస్తుంటారు. చెట్టు కింద గెలుపు వ్యూహాలు కూడా రచిస్తుంటారు.

గ్రామ పంచాయతీ నుండి ఎమ్మెల్యే వరకు ఎవరు పోటీ చేసినా పలువురు ఈ చెట్టు కింద కూర్చుంటారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు కోసం చెట్టు కింద సేద తీరుతున్నారు. ఈ చెట్టు కింద కూర్చుంటే గెలుస్తారనే నమ్మకం ఎస్ఎస్ పాటిల్ నుండి ప్రారంభమైంది.

కల్కేరి గ్రామానికి చెందిన పాటిల్ 1994 ఎన్నికల్లో జనతా దళ్ తరఫున పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఆయన చింతచెట్టు కింద కూర్చున్నారు. ఆ తర్వాత ఆ చింతచెట్టు కింద కూర్చుని ప్రచారం చేసిన అతను పలు ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఈ నమ్మకం పెరిగిపోయింది. పాటిల్ 2004 వరకు మూడుసార్లు గెలుస్తూ వచ్చారు.

వైయన్ గౌడ, వీరపక్ష గౌడ, రవింద్ర తదితరులు ఈ చెట్టు కింద కూర్చోవడం వల్లనే టౌన్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందినట్లుగా నమ్ముతుంటారు. పాటిల్ తర్వాత ఇతరులు గెలవడంతో ఈ చెట్టు కింద సేద తీరడం, ప్రచారం చేయడం చేస్తే గెలుస్తారనే భావన అభ్యర్థుల్లో మరింత నాటుకు పోవడంతో ఆ సెంటిమెంట్ పాటిస్తున్నారు.

English summary
Tamarind tree brings luck for candidates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X