• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబుకు వెండి చెప్పులు: వెంట బాలయ్య, లోకేష్

By Pratap
|

Chandrababu naidu
విశాఖపట్నం: సుదీర్ఘ పాదయాత్రను ముగిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఓ అభిమాని వెండి చెప్పులు బహూకరించాడు. శుక్రవారం రాత్రి కూర్మన్పాలెంలోని సుజనా స్టీల్స్‌లో బస చేసిన చంద్రబాబు నాయుడు శివాజీనగర్ నుంచి పాదయాత్ర సాగించారు. ఆయన వెంట బాలకృష్ణ, నారా లోకేష్, భువనేశ్వరి నడక సాగించారు. అక్కడి నుంచి ఆగనంపూడి చేరుకున్నారు.

ఆగనంపూడిలో చంద్రబాబు 60 అడుగుల ఎత్తు గల పైలాన్‌ను ఆవిష్కరించారు. విజయ స్థూపం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అక్కడి నుంచి బహిరంగ సభ జరిగే ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానానికి చేరుకుంటున్నారు.

బహిరంగ సభలో చంద్రబాబు సుమారు గంటసేపు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఏడు నెలల పాటు ప్రజల మధ్య పర్యటించి తాను గుర్తించిన సమస్యలను, వాటికి పార్టీ తరఫున పరిష్కారాలను వివరిస్తారు.

పకడ్బందీ ఏర్పాటు సుమారుగా 16 ఎకరాల విస్తీర్ణం గల ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొత్తం మూడు లక్షల మందికి ఆ ప్రాంతం సరిపోతుందని పోలీసుల అంచనా. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. సభను మధ్యాహ్నం మూడు గంటలకే ప్రారంభిస్తారు.

సినీ నటుడు ఏవీఎస్, నేపథ్య గాయకులు వందేమాతరం శ్రీనివాస్, సునీత, నాగూర్‌బాబు తదితరుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ సందేశాత్మక గీతాలు, ఎన్టీఆర్ సినిమాల్లోని సామాజిక చైతన్య గీతాలను గాయకులు ఆలపిస్తారు. రాత్రి ఏడుగంటలకల్లా సభను ముగించాలని పార్టీ అగ్రనాయకులు భావిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Telugudesam party president Nara Chandrababu Naidu unveiled the 60 feet pylan and NT Ramarao statue at Visakhapatnam. Balakrishna, Nara Lokesh and Bhuvaneswari participated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more