• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు పాదయాత్ర ముగిసింది.. బస్సుయాత్ర మిగిలింది!

By Srinivas
|
Chandrababu Bus Yatra after padayatra
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు త్వరలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు ఏడు నెలలు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేసిన చంద్రబాబు ఆదివారం హైదరాబాదుకు చేరుకొని త్వరలో రెండో దశ పోరాటం చేస్తానని ప్రకటించారు. తద్వారా సాధ్యమైనంత త్వరగా ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారని అర్థమవుతోంది. 208 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చంద్రబాబు 2,817 కిలోమీటర్లు నడిచారు. 16 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో పర్యటించారు.

మిగిలిన ఏడు జిల్లాల్లో ఆయన బస్సు యాత్ర చేపట్టనున్నారు. జూన్ నెలలో బస్సు యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. బాబు బస్సు యాత్ర ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ జిల్లాల్లో పర్యటన పూర్తయిన తర్వాత మిగిలిన 16 జిల్లాల్లో మిగిలిపోయిన శాసనసభ నియోజక వర్గాల్లో కూడా పర్యటించాలని బాబు యోచిస్తున్నారట.

ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉన్నందున బస్సు ద్వారా అయితే అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికలకు ముందు కూడా ఆయన 'మీ కోసం' పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ఈసారి యాత్ర కూడా అదే తీరులో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ నుంచి సుమారు ఆరు నెలలపాటు మిగిలిన అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించాలనేది చంద్రబాబు వ్యూహం.

నిరంతరాయంగా ప్రజల్లో ఉండటం ద్వారా తాము చెప్పదల్చుకున్న విషయాలను బలంగా వారికి చేరవేయవచ్చని, అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా ఉత్తేజపర్చవచ్చన్న భావనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. రెండో విడత యాత్ర చేపట్టడానికి ముందు మే నెలలో తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడానికి వినియోగించాలని భావిస్తున్నారు. మే నెలఖరులో హైదరాబాద్‌లో మహానాడును నిర్వహించిన అనంతరమే ఆయన బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 It could be called the second leg, as it were, of his padayatra — except that it will be by bus this time. TDP chief Nara Chandrababu Naidu who ended his arduous 208-day, 2,817-km walk through the state, ‘Vastunna Meekosam’, on Saturday in Visakhapatnam, will next embark on a bus yatra through the state, the dates for which he will finalise soon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more