వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌కు మోడీ చురకలు: రనౌట్ చేయొద్దని అజహర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi - Azharuddin
బెంగళూరు: కాంగ్రెసు పార్టీని గెలిపిస్తే సర్వనాశనం తప్ప ఏమీ ఉండదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. కర్నాటకలో ఎన్నికల నేపథ్యంలో ఆయన గుజరాత్ నుండి వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. బెంగళూరులోని జాతీయ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ సభలో ఆయన ప్రసంగించారు. మోడీ తన ప్రసంగంలో ఏఐశిసి ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీ పైన నిప్పులు చెరిగారు.

రాహుల్ బంగారం చెంచా నోట్లో పెట్టుకొని పుట్టిన నేత అని ఎద్దేవా చేశారు. లోకజ్ఞానం లేదన్నారు. రాహుల్ ఒక్క వ్యక్తితో ఏమీ కాదంటారని కానీ, ఒకే వ్యక్తి ఎన్నో అద్బుథాలు చేసిన విషయాన్ని గ్రహసిత్ మంచిదన్నారు. కాంగ్రెసు నేతలు హస్తాన్ని చూపిస్తున్నారని, ముఖాన్ని ఎందుకు చూపరన్నారు. ఆ తర్వాత ఏ చేయి అందుతుంతో ఎవరికి తెలుసునన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదని విమర్శించారు.

ప్రతి ఎన్నికల్లో కొత్త పథకాలు ప్రకటించడం... అధికారంలోకి వచ్చాక వాటిని బుట్టదాఖలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటైన పనేనని దుయ్యబట్టారు. జైపూర్ సమావేశాల్లో వారు చెప్పిన మాటలపై వారే నీళ్లు చల్లారని దుయ్యబట్టారు. క్రిమినల్స్‌కి టికెట్‌లివ్వమని, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించమని ఆ రోజు చెప్పారని, కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఎంతమంది క్రిమినల్స్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు.

రనౌట్ చేయకండి.. అజహరుద్దీన్

కర్నాటక ఎన్నికల ప్రచారంలో మాజీ క్రికెటర్, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అజహరుద్దీన్ కూడా పాల్గొన్నారు. బళ్లారి జిల్లా హోస్పేటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కాంగ్రెసు అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి హైదరాబాదు నుండి వచ్చానని, ఇంత దూరం వచ్చినందుకు అభ్యర్థిని గెలిపించి, తనను కూడా గెలిపించాలన్నారు. మధ్యలో మాత్రం తనను రనౌట్ చేయవద్దని చలోక్తి విసిరారు.

English summary

 With Karnataka slated to go to polls on May 5, BJP's star campaigner, Gujarat Chief Minister Narendra Modi, addressed a rally in Bangalore this evening, attacking the Congress and asking people to vote for the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X