వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు పర్యవేక్షణలో జగన్ కేసు విచారణ: కొట్టివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును హైకోర్టు పర్యవేక్షణలో జరపాలన్న పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది. జగన్ కేసును హైకోర్టు పర్యవేక్షణలో జరపాలని, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణను కేసు పూర్తయ్యే వరకు బదలీ చేయవద్దని శ్రీరంగరావు అనే లాయరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జగన్ ఆస్తుల కేసు హైకోర్టులో పర్యవేక్షణలో జరపాలన్న పిటిషన్‌ను కొట్టి వేసింది. ఆర్టికల్ 226 ప్రకారం ఈ పిటిషన్ విచారణార్హమైనదని పేర్కొంది. మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాద రావును క్యాబినెట్ నుండి తొలగించాలన్న పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ పైన విచారణ జూన్ 5వ తేదికి వాయిదా వేసింది.

నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్‌పై వాదనలు

జగన్ ఆస్తుల కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ పైన సుప్రీం కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి.

సిబిఐ తరఫు లాయర్లు బొగ్గు కుంభకోణం కేసులో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసును వాయిదా వేయాలని కోర్టును సిబిఐ కోరింది. ఇందుకు నిమ్మగడ్డ, విజయ సాయి రెడ్డి తరఫు లాయర్లు అంగీకరించారు. దీంతో కేసును కోర్టు వాయిదా వేసింది.

English summary
High Court of Andhra Pradesh has dismissed Sri Ranga Rao's petition over continution of CBI JD and Jagan DA case under supervision on High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X