వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ నోటికి మోరీకి తేడా లేదు: జగ్గారెడ్డి నిప్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy
హైదరాబాద్: గతంలో లక్షా యాభై వేల ఎకరాల గనులను ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చినప్పుడు మాట్లాడని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు వాటిని ప్రభుత్వ రంగ సంస్థకు ఇస్తే మాత్రం ఎందుకు గొంతు చించుకుంటున్నారని ప్రభుత్వ విప్, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) మంగళవారం ప్రశ్నించారు.

తెలంగాణ ఆస్తులను కాపాడిన ముఖ్యమంత్రిని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అని మండిపడ్డారు. బయ్యారంలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, ఆయన మాటలను నమ్మకుంటే ఎలా అన్నారు. తెలంగాణ సెంటిమెంటును వాడుకొని ప్రజలను రెచ్చగొట్టి వారిని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కెసిఆర్ చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకే బయ్యారం గనులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సోమవారం నాడు మెదక్ జిల్లా సభలో కేవలం జిల్లా గురించి మాట్లాడలేదని, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారన్నారు. బయ్యారం ఆస్తులను కాపాడినందుకు ముఖ్యమంత్రిని అభినందించాలన్నారు. బయ్యారం గనులకు మెదక్‌కు సంబంధం లేదన్నారు.

అలా కాకుండా భూకంపం సృష్టిస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. కెసిఆర్ ఎప్పుడైనా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎల్లుండి తెలంగాణ బందు ప్రజల కోసం కాదని వారి రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. బందుకు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. బందును తాము వ్యతిరేకిస్తున్నామని, మెదక్ జిల్లా ప్రజలు సహకరించరన్నారు. బందును సమర్థవతంగా ఎదుర్కోంటామన్నారు. కెసిఆర్ నోటికి, మోరీకి ఏమాత్రం తేడా లేదన్నారు. సిఎల్పీలో వైయస్ ఫోటో తొలగింపుపై చర్చిస్తామన్నారు.

English summary
Medak district Sanga Reddy MLA Jagga Reddy lashed out at TRS chief K Chandrasekhar Rao for his statement over Bayyaram mines issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X