వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మంత్రి శంకరన్న అరెస్టు: బెయిల్‌పై విడుదల

By Pratap
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: గ్రీన్‌ఫీల్డ్ భూముల వ్యవహారంలో సిఐడి అధికారులు మంగళవారం మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావును అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారు ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఇద్దరు పూచీకత్తులతో శంకరరావుకు బెయిల్ మంజూరైంది. శంకరరావు పాస్‌పోర్టును సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి గురువారం తమ ముందు హాజరు కావాలని సిఐడి అధికారులు శంకరరావును ఆదేశించారు.

గ్రీన్‌ఫిల్డ్ భూముల వివాదం కేసులో మాజీ మంత్రి, కాంగ్రెసు శానససభ్యుడు పి. శంకరరావుకు సిఐడి గతంలో నోటీసులు జారీ చేసింది. ఈ కేసును హైదరాబాదులోని నేరెడ్‌మెట్ పోలీసుల నుంచి సిఐడి తన చేతుల్లోకి తీసుకుంది. అయితే, శంకర్రావు అనారోగ్యంతో సీఐడీ విచారణకు హాజరుకాలేకపోయారు. తండ్రి తరపున కూతురు సుస్మిత సీఐడీ విచారణకు హాజరయ్యారు.

అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేకపోతున్నట్లు ఓ లేఖను శంకరరావు కూతురు ద్వారా సిఐడికి లేఖను పంపించారు. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరుపై గతంలో తీవ్ర వివాదం చెలరేగింది. ఆయనను అదుపులోకి తీసుకున్న తీరును అందరూ ఖండించారు.

అయితే, తాము విచారించేందుకే శంకరరావు ఇంటికి వెళ్లామని, స్టేషన్‌కు రమ్మంటే ఆయనే లుంగీ పైన వస్తానని చెప్పారని, తాము ఆయన పట్ల దురుసుగా వ్యవహరించలేదని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత శంకరరావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. దుమారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిఐడి విచారణకు ఆదేశించారు.

శంకరరావు ఏ సమయంలో కూడా సిఐడి అధికారులకు సహకరించలేదు. దీంతో కుటుంబ సభ్యులను విచారించి సిఐడి అధికారులు ముఖ్యమంత్రికి నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఇద్దరు పోలీసులపై చర్యలు కూడా తీసుకున్నారు.

English summary
Former minister and Congress MLA P Shankar Rao has been arrested by CID in Green fields lands issue. He has been released on bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X