వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అగ్నివేశ్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Swami Agnivesh
న్యూఢిల్లీ: తెలంగాణపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను స్వామి అగ్నివేష్ తప్పు పట్టారు. ఆ నివేదిక తప్పుల తడక అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు శాంతి ప్రియులని, ప్రత్యేక రాష్ట్రంపై శ్రీకృష్ణ కమిటీ తప్పుడు నివేదికను ఇచ్చిందని స్వామి అగ్నివేష్ ఆరోపించారు.

తెలంగాణ ఏర్పాటు చేస్తే హర్యానా, పంజాద్ మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే అక్కడ బతుకుందని, లేదంటే రెండు ప్రాంతాల్లో మనుగడ కష్టం అని అగ్నివేష్ హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ పార్లమెంటులో దీక్ష చేపట్టిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సంసద్ సత్యాగ్రహ దీక్షకు స్వామి అగ్నివేష్, బీజేపీ నేతలు ఉమా భారతి, స్మృతి ఇరానీలు మంగళవారం మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తెలంగాణలో అన్ని రకాల వనరులు ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మరో నేత ఉమాభారతి అన్నారు. బీజేపీ హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశామని, బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం అందరూ కలిసి పోరాటం చేయాలని ఉమాభారతి పిలుపునిచ్చారు.

తెలంగాణ నినాదాల హోరు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెవులకు చేరాలని నటి, బిజెపి ఎంపి స్మృతి ఇరానీ అన్నారు. రెండు రోజుల సత్యాగ్రహ దీక్ష అనంతరం తెలంగాణ జెఎసి కార్యకర్తలు, నాయకతులు పార్లమెంటు వైపు దూసుకెళ్లారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది.

English summary
Swami Agnivesh saif that the Srikrishna committee has given wrong report on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X