వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ జైల్లో గాయపడ్డ సరబ్‌జిత్ సింగ్ బ్రెయిన్ డెడ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sarabjit Singh
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లాహోర్ సెంట్రల్ జైలులో ఈ నెల 26న తోటి ఖైదీల దాడిలో గాయపడ్డ సరబ్‌జిత్ సింగ్ బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. సరబ్‌జిత్ సింగ్‌ను ఇంకా వెంటిలేషన్ పైన ఉంచాలా? తీసివేయాలా? అనే విషయాన్ని వైద్యులు ఈ రోజు తేల్చనున్నారు.

సరబ్‌జిత్ సింగ్‌కు అత్యుత్తమైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు పాకిస్థాన్ సోమవారం వెల్లడించింది. జిన్నా ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ షౌకత్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం నిరంతరం సరబ్‌జిత్ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. సరబ్‌జిత్‌ను జిన్నా ఆసుపత్రి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలను సమాచార మంత్రి అరిఫ్ నిజామీ కొట్టి పారేశారు.

అలాంటి ప్రతిపాదనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం సరబ్‌జిత్‌ను ఆసుపత్రిలో కలిసిన అతని కుటుంబ సభ్యులు సరబ్‌జిత్ పరిస్థితి అతి దయనీయంగా ఉందని తెలిపారు. సరబ్‌జిత్ పొట్ట ఉబ్బిందనీ, ముఖం వాచిందనీ సోదరి దల్బీర్ కౌర్ వెల్లడించారు.

కాగా, సరబ్‌జిత్‌ను అంతమొందించాలనుకున్నట్లు ఇక్కడి కోట్ లఖ్‌పత్ జైలులో అతనిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరచిన కేసులో ప్రధాన నిందితులు అమర్ అఫ్తాబ్, ముదస్సర్‌లు విచారణలో వెల్లడించారు. 1990లో లాహోర్‌లో బాంబు దాడులు జరిపి 14 మంది పాకిస్థాన్ పౌరుల ప్రాణాలు తీసినందుకే వారు సరబ్‌జిత్ ప్రాణాలు తీయాలనుకొన్నట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (జైళ్లు) మాలిక్ ముబాషిర్ ఈ మేరకు ప్రాథమిక నివేదిక సమర్పించారు.

English summary

 Indian death row prisoner in Pakistan Sarabjit Singh may be brain dead and is being sustained by life support system, reports said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X