• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు ప్రపంచ రికార్డ్స్: యాత్రపై జగన్ పార్టీ ఎద్దేవా

By Srinivas
|

YSR Congress
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఘనకార్యాలు రికార్డ్ చేయదగ్గవేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎద్దేవా చేసింది. మంగళవారం ఆ పార్టీ నేతలు ధర్మాన కృష్ణదాసు, భూమా నాగిరెడ్డి, సుచరితలు ఓ ప్రకటనను విడుదల చేశారు.

కాంగ్రెసు పార్టీతో చంద్రబాబు మిలాకత్ అయ్యారన్నారు. అలాగే వస్తున్నా పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు అనేక ఘనకార్యాలు సాధించారన్నారు. అవన్నీ ప్రపంచ రికార్డుల్లో నమోదు చేయదగ్గవేనని చురకలు అంటించారు. అధికార పార్టీతో కలిసి చంద్రబాబు మాయా కూటమిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు.

శాసనసభలో అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండి.. అధికార పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని నిలబెట్టారని ఆరోపించారు. వస్తున్నా మీకోసం సమయంలో బాబు యాత్ర రాజుగారి విహార యాత్రలా మారిందన్నారు. 2014 ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెసుతో కలిసి కూటమి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

పాదయాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారన్నారు. పాదయాత్రకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు యాత్ర తర్వాత తెలుగు - కాంగ్రెసు నేతగా మారి రికార్డ్ సృష్టించారని నిప్పులు చెరిగారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 YSR Congress Party leaders Dharmana Krishna Das and Sucharitha are blamed TDP chief Nara Chandrababu Naidu for his Vastunna Meekosam Padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more