కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇలాకాలో విభేదాలు: వైఎస్ బంధువుతో వాగ్వాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ysr Congress
కడప/నెల్లూరు: జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో బుధవారం విభేదాలు బయటపడ్డాయి. ఈ రోజు జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బ్రహ్మానంద రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి బంధువు కొండారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంఛార్జీ పదవి విషయంలో గొడవ రాజుకుంది. తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తర్వాత పలువురు కల్పించుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.

మరోవైపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోను మరోసారి విభేదాలు బయటపడ్డాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ మురళీధర్, మరో నేత కొమ్మి లక్ష్మినాయుడు, కాకానిల మధ్య ఈ రోజు విభేదాలు బయటకు వచ్చాయి. జిల్లా కార్యాలయంపై ఆధిపత్య పోరు నడుస్తోంది. మేకపాటి సోదరుల ప్రోత్సాహంతో కన్వీనర్‌గా ఎన్నికైన మురళీ కార్యాలయానికి రాగా, కాకాని వర్గం తాళం వేసింది. దీంతో మురళీ కార్యాలయం బయటే మీడియా సమావేశం నిర్వహించారు.

కాగా, ఇటీవల పలు జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. నెల్లూరులో నియోజకవర్గ ఇంఛార్జుల విషయంలో తమ మాట బేఖాతరు చేశారనే కారణంతో మేకపాటి సోదరులు, వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు తదితరులు అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ దాదాపు పార్టీకి దూరమయ్యే ప్రచారం సాగుతున్నా ఆమె బయటకు రాలేదు.

మరోవైపు కొత్తగా పార్టీలోకి ఎమ్మెల్యేలు రావడం పట్ల కూడా ఇంఛార్జిలకు ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇటీవల ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌లపై ఆశలు పెట్టుకొన్న ఇంఛార్జులు ఆందోళన వెలిబుచ్చారు. వారు ఏకంగా హైదరాబాదు వచ్చి తమ నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి.

English summary
The differces revealed in Kadapa and Sri Pottisriramulu Nellore districts YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X