హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వామి వివేకానందులను తయారు చేస్తా: సిబిఐ జెడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
హైదరాబాద్: విద్యార్థులను స్వామి వివేకానందులుగా తయారు చేస్తానని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ బుధవారం అన్నారు. ఆయన హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఉద్యోగ విరమణ అనంతరం పాఠశాల నెలకొల్పి ఏటా ఇరవై మంది విద్యార్థులను స్వామి వివేకానందుడిలా తయారు చేస్తానని చెప్పారు.

ప్రతి మనిషికి ఏదో సాధించాలన్న తపన అవసరమన్నారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ మంచి పుస్తకాలు చదువుతూ విజ్ఞానం పెంచుకోవాలని, ఆంగ్లం, మాతృభాషపై పట్టు అవసరమని అన్నారు. ఓటు హక్కును వినియోగించినప్పుడే మంచి నిర్ణయాలు తీసుకునే నాయకుడు వస్తాడన్నారు.

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. పదవి విరమణ విరమణ తర్వాత లెక్చరర్‌గా పని చేస్తానని చెప్పారు. రాబోయే కాలంలో అవినీతిరహిత సమాజం ఏర్పడితే సిబిఐ, పోలీసు శాఖల అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. అప్పుడు లెక్చరర్‌గా పని చేస్తానన్నారు. విద్యార్థులు లక్ష్యం దిశగా పయనించాలన్నారు. ప్రపంచానికి సంస్కృతికి, సాంప్రదాయం నేర్పిన భారత దేశం ప్రస్తుతం సంస్కృతి, సాంప్రదాయం నేర్చుకునే స్థితిలో ఉందన్నారు.

మీడియా మంచినే పోత్సహించే విధంగా ఉండాలన్నారు. అవినీతి రహిత సమాజం ఏర్పడితే సిబిఐ పదవి వదిలి లెక్చరర్‌గా పని చేస్తానన్నారు. సమాజానికి ఉపయోగపడే విషయాలపై మీడియా దృష్టి సారించాలని, బ్రేకింగ్ వార్తలపై కాదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ ఆదివారం అభిప్రాయపడ్డారు. నేడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా శక్తిమంతంగా ఉన్నాయని, కేవలం బ్రేకింగ్ వార్తలకే ప్రాధాన్యం ఇవ్వకూడదని సూచించారు.

English summary
CBI JD Laxmi Narayana said on Wednesday that he would become teacher after retirement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X