వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభ్యత, సంస్కారం నేర్చుకో: కెసిఆర్‌కు గంటా హితవు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganta Srinivas Rao
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభ్యత, సంస్కారం నేర్చుకుంటే మంచిదని మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం హితవు పలికారు. విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ఉనికిని కాపాడుకునేందుకే ఆయన విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో బలహీనపడుతున్న పార్టీని నిలబెట్టేందుకే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కెసిఆర్ మాట్లాడుతున్నారన్నారు.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మంత్రిగా, శాసనసభ ఉపసభాపతిగా పనిచేసిన కెసిఆర్ విధానాల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. బయ్యారం గనులను ఆంధ్రప్రాంత పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం దోచిపెడుతోందంటూ కెసిఆర్ చేసిన వాఖ్యలపై గంటా తీవ్రంగానే స్పందించారు.

ఎన్నో ఆత్మత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారని, లాభాల్లో నడుస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సైతం పనిచేస్తున్నారన్న వాస్తవాన్ని మర్చిపోవద్దని గుర్తుచేశారు. బయ్యారంలో మరో ఉక్కు కర్మాగారం పెట్టొద్దని తాము ఏనాడూ అనలేదని, ఆప్రాంత ప్రజానీకానికి సైతం ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

సాంకేతికంగా అక్కడ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని నిపుణులు పరిశీలిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సహజ సంపదను తామే వాడుకుంటామన్న వాదనలో అర్థం లేదన్నారు. బయ్యారం ఉక్కులో వీసమెత్తు తరలించినా అడ్డుకుంటామని పదేపదే ప్రకటిస్తున్న కెసిఆర్ తెలంగాణ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్‌లకు గ్యాస్ సరఫరా విషయం ప్రస్తావిస్తే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బయ్యారం గనుల కేటాయింపునకు విపరీతార్థాలు తీస్తూ భూకంపం సృష్టిస్తామనడం సభ్యత అనిపించుకోదన్నారు.

English summary
Telangana Rashtra Samithi chief K Chandrasekhar Rao must learn manners, how to address and talk to high profile leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X