వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరబ్: తాగిన మత్తులో 'హద్దు' దాటాడు, పోయాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sarabjit Singh
తరన్ తరన్: చేయని నేరానికి సరబ్‌జిత్ సింగ్ పాకిస్తాన్ జైలులో 22 ఏళ్ల పాటు అక్రమంగా మగ్గి, చివరకు లాహోర్ ఆస్పత్రిలో మరణించాడు. తప్పుడు గుర్తింపునకు సరబ్‌జిత్ బలయ్యాడు. అంతేకాదు, తాగుడుకు అతను బలయ్యాడని అతని మిత్రులు అంటున్నారు. సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి సరబ్‌జిత్ ప్రవేశించిన ఉదంతాన్ని పంజాబ్‌లోని తరన్ తరన్‌లో గల బాల్య మిత్రులు గుర్తు చేసుకుంటున్నారు.

విపరీతంగా మద్యం సేవించి మత్తులో అతను సరిహద్దు దాటాడని చెబుతున్నారు. 1990లో ఈ సంఘటన జరిగింది. సరబ్‌జిత్ ఆ రోజు ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళ్లాడు. ఆ తర్వాత ఎప్పటికీ తిరిగి రాలేదు. మద్యం సేవించిన మత్తులో అతను సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడని అతని మిత్రులు చెబుతున్నారు. మద్యానికి బానిస అయిన సరబ్‌జిత్ మొత్తం జీవితాన్నే కోల్పోయాడు.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో జరిగిన బాంబు దాడి కేసులో అతన్ని పాకిస్తాన్ దోషిగా నిర్ధారించింది. ఈ బాంబు పేలుడులో 14 మంది మరణించారు. 22 ఏళ్ల పాటు అతను జైలులో ఉన్నాడు. ఇటీవల అతనిపై తోటి ఖైదీలు దాడి చేశారు. దాంతో అతని తల పగిలింది. కోమాలోకి వెళ్లిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతనిపై దాడి చేసిన ఖైదీలపై హత్య కేసు నమోదు చేశారు.

సరబ్‌జిత్ అంత్యక్రియలు అతని కుటుంబ సభ్యుల కోరిక మేరకే జరుగుతాయని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. సరబ్‌జిత్ మృతి పట్ల సుశీల్ కుమార్ షిండే విచారం వ్యక్తం చేశాడు. సరబ్‌జిత్ మృతదేహాన్ని భారతదేశానికి అప్పగించడానికి పాకిస్తాన్ అంగీకరించింది.

English summary
49-year-old Sarabjit Singh, who succumbed to his injuries in a hospital in Pakistan on Thursday, May 2, was claimed to be a victim of mistaken identity who had suffered in a jail in Lahore for last 22 years. But now it seems that he was a victim of his drinking habits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X